SBI Travel Card: 7 రకాల కరెన్సీలు.. 20 లక్షల ఏటీఎంలలో ఈ కార్డు వాడొచ్చు!
విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్తగా మల్టీ
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్తగా మల్టీ కరెన్సీ ఫారిన్ ట్రావెల్ కార్డు పేరిట కొత్త ప్రీపెయిడ్ కార్డును తీసుకొచ్చింది. డాలర్, పౌండ్, దిర్హమ్.. ఇలా ఏడు వేర్వేరు కరెన్సీ లావాదేవీలను ఒకే కార్డు ద్వారా చేయొచ్చు. ఆయా దేశాల్లోని ఏటీఎంలు, మర్చెంట్ పాయింట్స్ వద్ద ఈ కార్డును వినియోగించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 లక్షల ఏటీఎంలు, 34.5 మిలియన్ మర్చెంట్ల వద్ద ఈ కార్డును ఉపయోగించొచ్చని ఎస్‌బీఐ ఓ ప్రకటలో తెలిపింది. కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలివీ...
* అమెరికా డాలర్, బ్రిటీష్ పౌండ్, యూరో, సింగ్‌పూర్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్, యూఏఈ దిర్హమ్.. ఇలా మొత్తం ఏడు రకాల కరెన్సీని ఒక్క కార్డులో లోడ్ చేసి పెట్టుకోవచ్చు.
* చిప్, పిన్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాకప్‌గా ఇంకో కార్డు కూడా ఉంటుంది.
* ఈ కార్డుకోసం ఎలాంటి బ్యాంక్ అకౌంట్ సమాచారం అక్కర్లేదు.
* ఒకవేళ కార్డు పోయినా, దొంగతనానికి గురైనా రీప్లేస్ చేసుకునేందుకు 24 గంటల సేవలు అందుబాటులో ఉంటాయి.
* చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఫారం-ఏ2 సమర్పించి ఏ ఎస్‌బీఐ శాఖలోనైనా ఈ కార్డును పొందొచ్చు. బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా కూడా అప్లయ్ చేసుకోవచ్చు. కార్డుపై ఉన్న గడువు తేదీ పూర్తయ్యే వరకు కార్డులో సొమ్మును లోడ్ చేసుకోవచ్చు.
* ఆన్‌లైన్‌లోనే కార్డు తాలూక బ్యాలెన్స్ వివరాలు, లావాదేవీ వివరాలు తెలుసుకోవచ్చు. ఏటీఎం లొకేటర్ సేవలనూ పొందొచ్చు.
* కార్డులో కరెన్సీని లోడ్ చేసినప్పుడే ఎక్స్ఛేంజ్ రేట్స్‌ను లాక్ చేసుకోవచ్చు.
* ఒక వేళ ఎప్పుడైనా లావాదేవీ సమయంలో సరిపడా డబ్బులు లేనప్పుడు వేరే కరెన్సీ నుంచి మొత్తంలోంచి ఆ లావాదేవీ జరపొచ్చు.
* కనీసం 200 డాలర్లు ఉండాలి. గరిష్ఠంగా 10వేల డాలర్ల వరకు ఏటీఎంల వద్ద విత్‌డ్రా, మర్చెంట్ పాయింట్స్ వద్ద ఖర్చు చేయొచ్చు.
* సంబంధిత ఏటీఎం ఆపరేటర్లు నిబంధనల మేరకు విత్‌డ్రా కోసం ఛార్జీలు వర్తిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి