SpiceJet: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ ఊరట.. 50% పరిమితి ఎత్తివేత
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు ఊరట లభించింది. విమానాలను నడిపే విషయంలో ఆ సంస్థపై విధించిన పరిమితిని డీజీసీఏ ఎత్తివేసింది.
దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు ఊరట లభించింది. విమానాలను నడిపే విషయంలో ఆ సంస్థపై విధించిన పరిమితిని డీజీసీఏ ఎత్తివేసింది. శీతాకాల షెడ్యూల్లో పూర్తి స్థాయిలో విమానాలను నడిపేందుకు వీలు కల్పించింది. స్పైస్ జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు వెలుగు చూడడంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దీంతో 50 శాతం సర్వీసులనే నడపాలంటూ జులై 27న ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌లో మరోసారి ఆ ఆంక్షలను పొడిగించింది. తాజాగా ఆ పరిమితిని తొలగించింది.
మరోవైపు అక్టోబర్ 30 నుంచి వచ్చే మార్చి 25 వరకు గల శీతాకాల షెడ్యూల్‌ను డీజీసీఏ ప్రకటించింది. ఈ షెడ్యూల్లో వారానికి దేశీయంగా 21,941 విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలకు అనుమతి మంజూరు చేసింది. 105 విమానాశ్రయాల నుంచి ఈ రాకపోకలు జరగనున్నాయని తెలిపింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఆ సంఖ్య 1.55 శాతం తక్కువ కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో వారానికి 22,287 విమానాలు నడిపేందుకు డీజీసీఏ అనుమతి ఇచ్చింది. తాజా షెడ్యూల్లో ఇండిగో గరిష్ఠంగా వారంలో 10,085 విమానాలను, స్పైస్‌జెట్ 3,193 విమానాలను నడపనుంది. ఎయిరిండియా (1,990), విస్తారా (1,941), ఎయిర్ ఏషియా (1,462), గో ఎయిర్ (1,390), అలయన్స్ ఎయిర్ (1,034), ఆకాశ ఎయిర్ (479), ఫ్లై బిగ్ (214), స్టార్ ఎయిర్ (153) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్