Appointment: ధనలక్ష్మి బ్యాంకుకు కొత్త ఎండీ

ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకు ధనలక్ష్మి బ్యాంకు ఎండీ, సీఈఓగా కేకే అజిత్‌ కుమార్‌ను నియమించింది. ఈ నెల 20 నుంచి వచ్చే మూడేళ్లు ఆయన పదవిలో కొనసాగుతారు.

Updated : 18 Jun 2024 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కేరళకు చెందిన ధనలక్ష్మి బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా కేకే అజిత్‌ కుమార్‌ను నియమించినట్లు ఆ బ్యాంక్‌ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ జూన్‌ 20 నుంచి వచ్చే మూడు సంవత్సరాల కాలానికి బ్యాంకు ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తారు. ఆయన నియామకాన్ని మంగళవారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదించింది. ఏప్రిల్‌ 18న ఈ నియామకానికి ఆర్‌బీఐ సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. అజిత్‌ కుమార్‌కు.. క్రెడిట్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, బిజినెన్‌, బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ మొదలైన డిపార్ట్‌మెంట్స్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌లో 36 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ప్రెసిడెంట్‌ క్యాడర్‌లో ఫెడరల్‌ బ్యాంకులో చీఫ్‌ HR ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని