వైట్ లేబుల్ ఏటీఎమ్ vs బ్రౌన్ లేబుల్ ఏటీఎమ్

బ్యాంకులు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కొంత మేర‌కు బ్యాంకింగ్ సేవ‌లను అందించేవి ఏటీఎమ్‌లు. వీటిలో 1. బ్యాంక్ ఓన్డ్ ఏటీఎమ్; 2. వైట్ లేబుల్ ఏటీఎమ్; 3. బ్రౌన్ లేబుల్ ఏటీఎమ్ అని మూడు ర‌కాలు ఉంటాయి. వీలైన‌న్నిఎక్కువ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ‌లు..

Published : 16 Dec 2020 20:34 IST

బ్యాంకులు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కొంత మేర‌కు బ్యాంకింగ్ సేవ‌లను అందించేవి ఏటీఎమ్‌లు. వీటిలో 1. బ్యాంక్ ఓన్డ్ ఏటీఎమ్; 2. వైట్ లేబుల్ ఏటీఎమ్; 3. బ్రౌన్ లేబుల్ ఏటీఎమ్ అని మూడు ర‌కాలు ఉంటాయి. వీలైన‌న్నిఎక్కువ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో బ్యాంకింగేత‌ర సంస్థ‌ల‌కు కూడా ఏటీఎమ్‌ల‌ను నిర్వ‌హించేందుకు రిజ‌ర్వుబ్యాంకు, ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది.

బ్యాంక్ ఓన్డ్ ఏటీఎమ్:

బ్యాంకులు స్వ‌యంగా ఏటీఎమ్ ల నిర్వ‌హ‌ణ చేస్తుంటాయి. కాబ‌ట్టి వీటిని బ్యాంక్ ఓన్డ్ ఏటీఎమ్ లు అంటారు. ఇందులో ఉండే రెండు ర‌కాలు ఆన్ సైట్ ఏటీఎమ్‌,
ఆఫ్ సైట్ ఏటీఎమ్.

ఆన్ సైట్ ఏటీఎమ్‌:

వీటిలో బ్యాంకు బ్రాంచిల ప‌క్క‌నే ఉండే ఏటీఎమ్ ల‌ను ఆన్ సైట్ ఏటీఎమ్‌లు అంటారు. వీటిలో అందించే సేవ‌లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. బ్రాంచీ ద్వారానే కాకుండా ఈ ఏటీఎమ్ ల ద్వారా కార్య‌క‌లాపాలు చేసేందుకు వీలుగా వివిధ సేవ‌ల‌ను క‌ల్పిస్తుంటారు.

ఆఫ్ సైట్ ఏటీఎమ్:

బ్యాంకులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏటీఎమ్ ల‌ను నెల‌కొల్పుతాయి. వీటి నిర్వ‌హ‌ణ బ్యాంకులే స్వ‌యంగా చూసుకుంటాయి. అన్ని ప్రాంతాల‌కు బ్యాంకింగ్ సేవ‌లు విస్తరించే ఉద్దేశంతో చేప‌ట్టినవి.

వైట్ లేబుల్ ఏటీఎమ్:

ఇవి బ్యాంకింగేత‌ర సంస్థ‌లు ఏర్సాటు చేస్తుంటాయి. వీటిని నెల‌కొల్పేందుకు సంస్థ‌ల‌కు రూ.100 కోట్ల మూల‌ధ‌నం ఉండాలి. వీటికి సంబంధించి ఎఫ్‌డీఐ ప‌రిమితి 100 శాతంగా ఉంది. ఈ ఏటీఎమ్ ల‌పై ఏ బ్యాంకు లోగో ఉండ‌దు కాబ‌ట్టి వీటిని వైట్ లేబుల్ ఏటీఎమ్ అంటారు. మ‌న దేశంలో తొలుత టాటా ఇండీక్యాష్ పేరుతో వైట్ లేబుల్ సేవ‌ల‌ను ప్రారంభించారు. వైట్ లేబుల్ ఏటీమ్‌లు టైర్3-6 ప్రాంతాల్లో నెల‌కొల్పాల‌నే నిబంధ‌న ఉంది. ఇవి రిజ‌ర్వు బ్యాంకునియంత్ర‌ణ‌లో ఉంటాయి.

బ్రౌన్ లేబుల్ ఏటీఎమ్:

బ్యాంకులు ఏటీఎమ్ నిర్వ‌హ‌ణను ఇత‌ర థ‌ర్డ్ పార్టీ సంస్థ‌ల‌కు అందిస్తారు. ఇవి సాధార‌ణ బ్యాంక్ ఏటీఎమ్ ల్లానే ఉంటాయి. న‌గ‌దు నింప‌డం, తీయ‌డం, ఏటీఎమ్ నిర్వ‌హ‌ణ త‌దిత‌ర సేవ‌ల‌సు థ‌ర్డ్ పార్టీ సంస్థ‌లు చేస్తుంటాయి. వైట్ లేబుల్ ఏటీఎమ్ ల్లా ఫ‌లానా ప్రాంతాల్లో పెట్టాల‌నే నిబంధ‌న ఉండ‌దు. వీటికి రిజ‌ర్వు బ్యాంకు నిర‌యంత్ర‌ణ ఉండ‌దు. బ్యాంకుల‌ను, స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు మ‌ధ్య ఒప్పందం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని