Car Loans: ఎల‌క్ట్రిక్, నాన్-ఎల‌క్ట్రిక్ కార్ల‌ రుణాల వ‌డ్డీ రేట్ల‌లో తేడా ఎంత‌?

గ‌తంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలపై బ్యాంకు రుణాల వ‌డ్డీ రేట్లు కాస్త అధికంగా ఉండేవి. కానీ, ఇప్పుడు వ‌డ్డీ రేట్లు త‌గ్గాయి. నాన్ ఎల‌క్ట్రిక్‌, ఎల‌క్ట్రిక్ కార్ల రుణ వ‌డ్డీ రేట్ల‌లో స్వ‌ల్ప తేడా ఉంది. 

Updated : 06 Oct 2022 14:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌డం.. అందులోనూ యువ‌త‌కు ఉద్యోగం పొందిన ఆరంభంలోనే మంచి సంపాద‌న తోడ‌వ‌డంతో కార్లు కొనేవారి సంఖ్య దేశంలో విప‌రీతంగా పెరిగింది. సెప్టెంబ‌రు నెల‌లో దేశ‌వ్యాప్తంగా అన్ని ర‌కాల కార్లు క‌లిపి 3.50 ల‌క్ష‌ల‌కు పైగా అమ్ముడ‌య్యాయి. ఆగ‌స్టులో అమ్మ‌కాలు 2.81 ల‌క్ష‌లుగా ఉంది. అయితే, ఇందులో ఎల‌క్ట్రిక్ కార్లు అమ్మ‌కాలు ఆశించినంత‌ లేక‌పోయినా సెప్టెంబ‌రులో 7,247 ఎల‌క్ట్రిక్ కార్ల విక్ర‌యాలు జ‌రిగాయి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలతో మేలెంత?

ఈ వాహ‌నాలు ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూల‌మైన‌వి. పెరిగిపోయిన పెట్రోలు, డీజిల్ ఖ‌ర్చుల‌ను వాహ‌నదారులు ఇప్ప‌టికే భ‌రించ‌లేకపోతున్నారు. ఎల‌క్ట్రిక్ కారు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు చాలా త‌క్కువ. దీనికి విద్యుత్‌ ఛార్జింగ్ చేస్తే స‌రిపోతుంది. ఈ వాహ‌నాల కొనుగోలుపై కొన్ని రాష్ట్రాలు ప‌న్నుల‌లో అనేక రాయితీలిస్తున్నాయి. చాలా కార్ల కంపెనీలు వీటి అభివృద్ధి, ఉత్ప‌త్తిపై దృష్టిపెట్ట‌డంతో భ‌విష్య‌త్‌లో ఈ కార్ల ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశం ఉంది.

వ‌డ్డీ రేట్లు

గ‌తంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలపై బ్యాంకు రుణాల వ‌డ్డీ రేట్లు కాస్త అధికంగా ఉండేవి. కానీ, ఇప్పుడు వ‌డ్డీ రేట్లు త‌గ్గాయి. నాన్ ఎల‌క్ట్రిక్‌, ఎల‌క్ట్రిక్ కార్ల రుణ వ‌డ్డీ రేట్ల‌లో స్వ‌ల్ప తేడా ఉంది. కొన్ని ప్ర‌ముఖ బ్యాంకు రుణాల వ‌డ్డీ రేట్ల (శాతంలో) తేడా ఎంతుందో ఈ కింది ప‌ట్టిక‌లో చూద్దాం

గ‌మ‌నిక: ఈ వ‌డ్డీ రేట్లు సెప్టెంబ‌రు 27 నాటివి. ఈ ప‌ట్టిక‌లో పేర్కొన్న వ‌డ్డీ రేట్లు బ్యాంకులు విధించే అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే. మీ ఆదాయం, తీసుకునే రుణం, క్రెడిట్ స్కోరుని బట్టి వ‌డ్డీ రేట్ల‌లో మార్పులు ఉండొచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు అద‌నంగా ఉంటాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని