బ‌ంగారం ఇలా కూడా కొనొచ్చు

ఈ -గోల్డ్ అంటే ఎల‌క్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయ‌డం. మీ పేరుపై బంగారం అధికారికంగా న‌మోదై ఉంటుంది. దాన్ని బంగారంగా మార్చుకుని ఇంటికి తెచ్చుకోవాలా? లేదా మార్కెట్లో అప్ప‌టి ధ‌ర‌కు విక్ర‌యించాలా?....

Updated : 02 Jan 2021 17:41 IST

ఈ-గోల్డ్ అంటే ఎల‌క్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయ‌డం. మీ పేరుపై బంగారం అధికారికంగా న‌మోదై ఉంటుంది. దాన్ని బంగారంగా మార్చుకుని ఇంటికి తెచ్చుకోవాలా? లేదా మార్కెట్లో అప్ప‌టి ధ‌ర‌కు విక్ర‌యించాలా? అనేది మ‌దుప‌ర్లు తీసుకునే నిర్ణ‌యంపై ఆధార‌ప‌డుతుంది.బంగారంపై పెట్టుబ‌డి చేసి రాబ‌డి పొందాల‌నుకునే వారికి ఈ గోల్డు విధానంలో మ‌దుపు చేయ‌డం లాభ‌దాయ‌కం. న‌గ‌ల దుకాణం నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం ఒక ప‌ద్ధ‌తి. అదే బంగారాన్ని ఎల‌క్ట్రానిక్ రూపంలో కూడా కొనుగోలు చేయోచ్చు. ఆ బంగారాన్ని డెలివ‌రీ స‌దుపాయం ద్వారా పొంద‌వ‌చ్చు.ఈ- గోల్డు కొనుగోలు చేసేందుకు ఉన్న కొన్ని ప‌ద్ధ‌తుల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌స్తుతం ఎల‌క్ట్రానిక్ విధానంలో బంగారం కొనుగోలు చేసేందుకు మార్గాలు…

ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ:

గోల్డు ఈటీఎఫ్ లు కాకుండా, ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ ద్వారా బంగారాన్ని క్ర‌మ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ విధానంలో మీరు 0.5 గ్రాము నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్ర‌మంగా కొనుగోలుచేస్తూ త‌ద్వారా మీకు అవ‌స‌ర‌మైనంత బంగారాన్ని పొంద‌వ‌చ్చు. ఈ విధానంలో బంగారం నేరుగా రిఫైన‌రీ నుంచి మ‌దుప‌ర్ల‌కు అందుతుంది.

సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కాలు:

నేరుగా బంగారం కొనుగోలు చేయ‌న‌ప్ప‌టికీ బంగారం కొనుగోలు చేసేందుకు కావ‌ల్సిన డ‌బ్బును మ‌దుప‌ర్లు పొంద‌వ‌చ్చు. ఈ విధానంలో కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసే బంగారుబాండ్లను కొనుగోలు చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీ ముగిసిన త‌రువాత బాండ్ల ద్వారా వ‌చ్చే మొత్తం మార్కెట్లో ఆ స‌మ‌యంలో ఉన్న ధ‌ర‌కు స‌మానంగా ఉంటుంది. కాబ‌ట్టి ఆ మొత్తంతో మార్కెట్లో బంగారం కొనుగోలు చేయ‌వ‌చ్చు. సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కాలు

బంగారం ఫ్యూచ‌ర్లు

వీటితో పాటు ఎమ్‌సీఎక్స్ క‌మోడిటీ ఎక్స్ఛేంజీ ద్వారా బంగారం ఫ్యూచ‌ర్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ విధానంలో డెలివ‌రీ తీసుకోవ‌చ్చు. డెలివ‌రీ పొందేందుకు ఎక్స్ఛేంజీ నిర్ణ‌యించిన బ‌రువులో కొనుగోలు చేసి బంగారం బిస్కెట్లు, బార్‌ల రూపంలో తీసుకోవచ్చు.

ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ గురించి:

ఈ సంస్థ భార‌త ప్ర‌భుత్వం స్విట్జ‌ర్ ల్యాండ్ కు చెందిన పీఏఎమ్‌పీ ఎస్ఏ తో 2008 లో క‌లిపి స్థాపించారు. దీని కార్య‌కాలాపాలు పూర్తి స్థాయిలో 2012 నుంచి ప్రారంభ‌మయ్యాయి. బంగారం కొనుగోలు దారుల‌కు కావ‌ల్సిన ప‌రిమాణాల్లో ఈ సంస్థ అందిస్తుంది.

మోతీలాల్ ఓస్వాల్ ఎమ్ఈ గోల్డ్ ప‌థ‌కం ద్వారా ఇందులో బంగారం క్ర‌మంగా సిప్ విధానంలో కొనుగోలు చేసే ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది.

999.9 స్వ‌చ్ఛ‌త‌…

  • నాణ్య‌మైన బంగారం, వెండి ల‌భిస్తుంది. నేరుగా రిఫైన‌రీ నుంచి తెచ్చిన బంగారం అందుబాటులో ఉంటుంది. స్వ‌చ్ఛ‌త‌కు ఇది బెంచ్ మార్క్.
  • ఈ ప‌థ‌కం ద్వారా బంగారం కొనుగోలు చేసి ఎమ్ఎమ్‌టీసీ పీఏఎమ్‌పీ వ్యాలెట్ల‌లో భ‌ద్ర‌ప‌రుస్తుంది. దీనికి అద‌నంగా ఛార్జీలు ఉండ‌వు.
  • ఈ విధానంలో మీరు 0.5 గ్రాము నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్ర‌మంగా కొనుగోలుచేస్తూ త‌ద్వారా మీకు అవ‌స‌ర‌మైనంత బంగారాన్ని పొంద‌వ‌చ్చు.
  • ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ ద్వారా బంగారాన్ని క్ర‌మ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేసిన బంగారాన్ని డెలివ‌రీ పొంద‌వ‌చ్చు. కావాలంటే వారికి తిరిగి ఆన్ లైన్ లోనే క్ర‌య‌విక్ర‌యాలు చేయ‌చ్చు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు