Offline Payments: త్వరలో ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు!
ముంబయి: దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో త్వరలో ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఏర్పడనుంది. దీనిపై త్వరలో ఓ కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు.
దీనికి సంబంధించి గత ఏడాది ఆగస్టులోనే ఆర్బీఐ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. తక్కువ విలువ కలిగిన రిటైల్ లావాదేవీలను కార్డులు, మొబైల్ సాధనాల ద్వారా పూర్తి చేసేందుకు అనుమతించింది. ఈ విధానంలో గరిష్ఠంగా రూ.200 వరకు స్వీకరించారు. పైలట్ ప్రాజెక్టులో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ సదుపాయం కల్పించేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఇంటర్నెట్ సదుపాయం లేని లేదా నెట్వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ అప్పట్లో పేర్కొంది.
ఈ పైలట్ ప్రాజెక్టు మార్చి 31, 2021 వరకు కొనసాగింది. ఎలాంటి అదనపు ధ్రువీకరణలు అవసరం లేకుండానే చెల్లింపులను అనుమతించారు. కార్డులు, మొబైల్ వ్యాలెట్ల ద్వారా డబ్బులను స్వీకరించారు. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడంతో దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: మిర్యాలగూడలో కారు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం
-
Sports News
IND vs WI : ఐదో టీ20 మ్యాచ్.. విండీస్‌కు భారత్ భారీ లక్ష్యం
-
Politics News
Cabinet: ఆగస్టు 15కు ముందే ‘మహా’ కేబినెట్ విస్తరణ.. హోంశాఖ ఆయనకేనట?
-
World News
Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?
-
Sports News
INDw vs AUSw : క్రికెట్ ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆసీస్
-
Sports News
CWG 2022 : డబుల్స్ టీటీ.. రజతంతో సరిపెట్టుకున్న భారత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?