Diney+ Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవల్లో అంతరాయం.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం

Diney+ Hotstar Down: వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్‌లో అవాంతరం తలెత్తింది. భారత్‌- ఆసీస్‌ మ్యాచ్‌ మిస్‌ అవుతున్నామంటూ కొందరు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.

Published : 17 Feb 2023 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Diney+ Hotstar) సేవల్లో అంతరాయం ఏర్పడింది. హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తుంటే.. ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు ఫిర్యాదు చేశారు. దిల్లీలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న వేళ ఈ అంతరాయం నెలకొనడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి.

డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవల్లో దేశవ్యాప్తంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఉదయం 11.30 నుంచి సేవల్లో అవాంతరాలు ఎదుర్కొన్నట్లు యూజర్ల ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. దిల్లీ, జైపుర్‌, కోల్‌కతా, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, ముంబయి, చండీగఢ్‌ నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. తనకూ ఈ అంతరాయం ఏర్పడినట్లు మాజీ క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌ ట్వీట్‌ చేశారు. యూజర్లకు కలిగిన అసౌకర్యంపై హాట్‌స్టార్‌ స్పందించలేదు. ఏ కారణం చేత అవాంతరం తలెత్తిందీ వెల్లడించలేదు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని