డైరెక్ట్‌ ప్లాన్ vs రెగ్యుల‌ర్ ప్లాన్

సాధార‌ణంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఏజెంటును ఆశ్ర‌యిస్తుంటాం. వారి సూచ‌న‌ల మేర‌కు ఫండ్ ఎంపిక, ద‌ర‌ఖాస్తు చేయ‌డం మొద‌లైనవి పూర్తిచేస్తాం. ఈ ఏజెంట్లు లేదా స‌ల‌హాదారులు మ‌న పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వేక్షించి మార్పులు చేర్పులు చేయ‌డంలో స‌హ‌క‌రిస్తారు. పెట్టుబ‌డి చేసేట‌ప్పుడు ఫండ్ ఎంపిక చాలా కీల‌కం....

Published : 16 Dec 2020 11:47 IST

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు డైరెక్ట్ ప్లాన్ లో చేస్తే మంచిదా? రెగ్యుల‌ర్ ప్లాన్ అయితే మంచిదా? వీటి మ‌ధ్య ఉండే తేడా గురించి తెలుసుకుందాం.

సాధార‌ణంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఏజెంటును ఆశ్ర‌యిస్తుంటాం. వారి సూచ‌న‌ల మేర‌కు ఫండ్ ఎంపిక, ద‌ర‌ఖాస్తు చేయ‌డం మొద‌లైనవి పూర్తిచేస్తాం. ఈ ఏజెంట్లు లేదా స‌ల‌హాదారులు మ‌న పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వేక్షించి మార్పులు చేర్పులు చేయ‌డంలో స‌హ‌క‌రిస్తారు. పెట్టుబ‌డి చేసేట‌ప్పుడు ఫండ్ ఎంపిక చాలా కీల‌కం. ప‌నితీరు బాగుండే వాటికి, అంతంత‌ మాత్రం ప‌నితీరు క‌న‌బ‌రిచే ఫండ్ల మ‌ధ్య వ‌చ్చే రాబ‌డిలో వ్య‌త్యాసం ఉంటుంది. 

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు మ‌దుప‌ర్ల‌కు రెండు మార్గాలున్నాయి. అవి డెరెక్ట్ ప్లాన్, రెగ్యుల‌ర్ ప్లాన్. డైరెక్ట్‌ ప్లాన్ - మదుప‌ర్లు నేరుగా ఫండ్ నిర్వాహణ సంస్థ‌ నుంచి యూనిట్ల కొనుగోలు చేసే విధానాన్ని డైరెక్ట్ ప్లాన్ అంటారు. ఈ విధానంలో ఏజెంట్లకు ఎలాంటి పాత్ర ఉండ‌దు. రెగ్యుల‌ర్ ప్లాన్డి - డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసే విధానాన్ని రెగ్యుల‌ర్ ప్లాన్ అంటారు. డైరెక్ట్ ఎవ‌రికి మేలంటే…మ‌దుప‌ర్ల‌కు ఫండ్ ఎంచుకోగ‌ల నైపుణ్యం, ద‌ర‌ఖాస్తు చేసే విధానం, పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వేక్షించుకోగ‌ల‌ స‌మ‌యం ఉంటే నేరుగా మ్యూచువ‌ల్ ఫండ్ ని సంప్రదించి మ‌దుపు చేయ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు ఏజెంట్ క‌మీష‌న్ చార్జీలు త‌గ్గుతాయి. మ‌దుప‌ర్లు త‌మకు స‌రిపోయే ప‌ద్ధ‌తిలో ఫండ్లో పెట్టుబడులు చేయవ‌చ్చు. రాబ‌డిలో స్వ‌ల్ప తేడా - ఒకే ఫండ్ రెగ్యుల‌ర్ ప్లాన్ కంటే డైరెక్టు ప్లాన్ లో రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్లో మదుప‌ర్లు నేరుగా ఫండ్ హౌస్ నుంచి యూనిట్ల కొనుగోలు చేస్తారు. డిస్ట్రిబ్యూట‌ర్ కి క‌మీష‌న్లు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. మ‌దుప‌రి చేసిన పెట్టుబ‌డి మొత్తం ఫండ్ పెట్టుబ‌డుల్లోకి వెళుతుంది. అదే రెగ్యుల‌ర్ ప్లాన్లో మ‌దుప‌ర్లు యూనిట్ల‌ను డిస్ట్రిబ్యూట‌ర్ లేదా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తారు కాబ‌ట్టి డిస్ట్రిబ్యూట‌ర్ కి క‌మీష‌న్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వాహ‌కులు చెల్లించాలి. ఉదాహ‌ర‌ణ‌:ఒకే ఫండ్ తాలుకా గ్రోత్ ఆప్ష‌న్ ల రెగ్యుల‌ర్, డైరెక్ట్ ఎన్ఏవీలు ప‌రిశీలిద్దాం…Franklin India Smaller Companies: డైరెక్ట్ లో 54.993, రెగ్యుల‌ర్ లో 51.50. సాధారణంగా రెగ్యుల‌ర్, డైరెక్ట్ ప్లాన్లో ఎన్ఏవీల మ‌ధ్య స్వ‌ల్ప తేడా ఉంటుంది. అయితే కొన్ని ఫండ్లలో మాత్రం (పైన తెలిపిన ఫండ్ వలే) రెగ్యులర్ ప్లాన్ లో వ్యయ నిష్పత్తి ఎక్కువ ఉండడం వల్ల ఎన్ఏవీలో తేడా ఎక్కువగా ఉండవచ్చు. వ్యూహం ఒక్క‌టే - ఫండ్ పోర్టుఫోలియో (ఎంపిక‌ చేసిన కంపెనీల షేర్లు, బాండ్లు త‌దిత‌ర పెట్టుబ‌డి సాధ‌నాలు) లో డైరెక్ట్ ,రెగ్యుల‌ర్ ప్లాన్ల మ‌ధ్య‌ ఎటువంటి తేడా ఉండ‌దు. ఇంకా రిస్క్(న‌ష్ట‌ భ‌యం) ఎక్జిట్ లోడ్ (నిష్క్ర‌మ‌ణ ఛార్జీలు) పెట్టుబ‌డి వ్యూహం మొద‌లైనవ‌న్ని రెండు ప్లాన్ ల‌లో ఒకే విధంగా ఉంటాయి. 

డైరెక్ట్ ప్లాన్ కంటే రెగ్యుల‌ర్ ప్లాన్ లో ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు (ఎక్స్‌పెన్స్ రేషియో) ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో ఒకే ఫండ్ రెగ్యుల‌ర్ ప్లాన్ కంటే డెరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ ఎక్కువ ఉంటుంది. డైరెక్టు ప్లాన్ ద్వారా పెట్టుబ‌డి చేసే విధానం - డైరెక్టు ప్లాన్ కోసం ఆన్ లైన్లో ఆయా కంపెనీల‌కు సంబంధించిన వెబ్ సైటు లేదా ఈ స‌ర్వీసులు అందించే ఇత‌ర వెబ్ సైట్ల‌ నుంచి ద‌ర‌ఖాస్తు నింపాలి. www.mfuindia.comwww.kuvera.in లాంటి వెబ్సైట్లని పరిశీలించండి. ఆఫ్ లైన్లో చేసేవారు ద‌ర‌ఖాస్తు చేసేట‌పుడు డెరెక్టు ప్లాన్ ని ఎంచుకోవాలి. ద‌ర‌ఖాస్తులో ఆ స‌దుపాయం లేక‌పోతే Amfi Registration Number, ARN నంబ‌రు వేసే చోట డైరెక్ట్ ప్లాన్ అని రాయాలి. అప్పుడు ఆ ద‌ర‌ఖాస్తు డైరెక్టు ప్లాన్ కింద వ‌స్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని