Tax collection: 25 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Direct tax collection: ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. జనవరి 10 నాటికి గతేడాదితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వసూళ్లు అధికంగా జరిగాయి. 

Published : 11 Jan 2023 23:47 IST

దిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Direct tax collection) గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 24.58 శాతం పెరిగినట్లు ప్రభుత్వం వెలువరించిన గణాంకాలు చెబుతున్నాయి. రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికర వసూళ్లు 19.55 శాతం అధికంగా మొత్తం రూ.12.31 లక్షల కోట్లుగా లెక్క తేలింది.

ఈ ఏడాది మొత్తం రూ 14.20 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా సమకూరుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఆ లెక్కన జనవరి 10నాటికే 86.68 శాతం వసూళ్లు సాధించినట్లయ్యింది. కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 19.72 శాతం పెరగ్గా.. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 30.46 శాతం పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి జనవరి 10 మధ్య మొత్తం రూ.2.40 లక్షల కోట్లను పన్ను చెల్లింపుదారులకు రిఫండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని