Direct tax collection: తొలి 6నెలల పన్ను వసూళ్లలో 24 శాతం వృద్ధి

తొలి ఆరు నెలల పన్ను వసూళ్లలో 24 శాతం వృద్ధి నమోదైంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 మధ్య రూ.8.98 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి.

Published : 09 Oct 2022 14:50 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24 శాతం పెరిగినట్లు కేంద్ర పన్నుల విభాగం తెలిపింది. కార్పొరేట్‌ పన్నుల్లో 16.74 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో 32.30 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 మధ్య రూ.8.98 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు తెలిపింది.

రీఫండ్ల సర్దుబాటు తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా నమోదైనట్లు పన్నుల విభాగం తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 16.3 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్న ప్రత్యక్ష పన్నుల అంచనాల్లో ఇది 52.46 శాతానికి సమానమని పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబరు 8 మధ్య రూ.1.53 లక్షల కోట్లు రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే పెరిగినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని