
ABG Shipyard: తక్కువ సమయంలోనే బ్యాంకులు మోసాన్ని గుర్తించాయి
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్బీఐ- సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి సోమవారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్ కరెన్సీకి సంబంధించి ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బడ్జెట్‌కు ముందునుంచే సీబీడీసీ విషయమై ఆర్బీఐతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో చర్చల అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయా అంశాల మాదిరిగానే డిజిటల్ కరెన్సీపై ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంకు తరఫున అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
ఇటీవల గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ రూ.22,842 కోట్ల మేర బ్యాంకులను మోసగించిన వ్యవహారం వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే బ్యాంకులు ఈ మోసాన్ని గుర్తించాయని చెప్పారు. యూపీఏ హయాంలోనే ఏబీజీకి రుణాలు ఇచ్చారని, 2013 నవంబర్‌లో సంబంధిత అకౌంట్ ఎన్పీఏగా మారిందని తెలిపారు. ‘ఈ తరహా మోసాలను ప్రకటించే ముందు బ్యాంకులు ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరిస్తాయి. దాదాపు 52-54 నెలలపాటు పూర్తిస్థాయిలో పరిశీలనలు చేస్తాయి. ఏబీజీ షిప్‌యార్డ్ విషయంలో మాత్రం సాధారణానికంటే తక్కువ సమయం పట్టింది’ అని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?: రేవంత్
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్ మంత్రుల శాఖలు వెనక్కి
-
Sports News
Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
-
India News
Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు
-
Politics News
KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్
-
Crime News
Crime News: ఆస్పత్రికొచ్చిన గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- చెరువు చేనైంది
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?