Disney Layoffs: డిస్నీలో 7000 మంది ఉద్యోగుల తొలగింపు
Layoffs in Disney: టెక్ కంపెనీల తరహాలో ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణ కోసం భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను సైతం ప్రకటించింది.
శాన్ఫ్రాన్సిస్కో: ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ సైతం ఉద్యోగుల తొలగింపులను (Layoffs in Disney) ప్రకటించింది. దాదాపు 7,000 మందికి ఉద్వాసన పలకనున్నట్లు బుధవారం వెల్లడించింది. సీఈఓ బాబ్ ఐగర్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం ఇదే. 2021 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం డిస్నీ (Disney)లో ప్రపంచవ్యాప్తంగా 1,90,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది పూర్తిస్థాయి ఉద్యోగులు.
తగ్గిన డిస్నీ+ సబ్స్క్రైబర్లు..
అక్టోబరు- డిసెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ బుధవారం డిస్నీ ఉద్యోగుల తొలగింపులను (Layoffs in Disney) ప్రకటించింది. తమ స్ట్రీమింగ్ సేవలకు తొలిసారి చందాదారులు తగ్గినట్లు వెల్లడించింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో డిస్నీ+ సబ్స్క్రైబర్ల (Disney+ Subscribers) సంఖ్య త్రైమాసిక ప్రాతిపదికన 1 శాతం తగ్గి 168.1 మిలియన్లకు చేరినట్లు పేర్కొంది. కంపెనీ ఆదాయం 23.512 బిలియన్ డాలర్లు, లాభం 1.279 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లుగా వెల్లడించింది.
భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక
తొలగింపులతో పాటే డిస్నీ భారీ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను ప్రకటించింది. కంపెనీలని మూడు విభాగాలుగా విభజించనున్నట్లు తెలిపింది. సినిమాలు, టీవీ, స్ట్రీమింగ్‌ను ఎంటర్టైన్మెంట్ యూనిట్ కిందకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. క్రీడలకు సంబంధించిన ఈఎస్పీఎన్ నెట్‌వర్క్‌ను ప్రత్యేక యూనిట్‌గా, డిస్నీ పార్క్‌లు, ఎక్స్‌పీరియెన్స్‌లు, ప్రొడక్ట్‌లను ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేస్తామంది. వ్యయ నియంత్రణ కోసం ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్‌లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్‌పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్‌కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో హైదరాబాద్‌కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?