Disney+: నెట్‌ఫ్లిక్స్‌ బాటలో డిస్నీ+.. పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు చెక్‌.. ఇండియాలోనూ?

Disney+ password sharing: ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ సైతం పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు చెక్‌ పెట్టేందుకు నిర్ణయించింది. నవంబర్‌ 1 నుంచి కెనడాలో దీన్ని తొలుత అమలు చేయనుంది. 

Published : 28 Sep 2023 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ సంస్థలన్నీ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను అడ్డుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. తొలుత అమెరికాకు చెందిన ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (password sharing) ఈ నిర్ణయం తీసుకోగా.. తాజాగా డిస్నీ+ (Disney+) సైతం అదే మార్గంలో పయనిస్తోంది. నవంబర్‌ 1 నుంచి పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపివేస్తూ నిర్ణయించింది. ప్రస్తుతానికి కెనడాలో దీన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఇకపై ఫ్యామిలీ మెంబర్లు మాత్రమే వినియోగించుకునేందుకు వీలుగా యూజర్‌ అగ్రిమెంట్‌లో మార్పులు చేసింది.

చాట్‌జీపీటీ నుంచి బిగ్ అప్‌డేట్‌.. ఇక రియల్‌టైమ్‌ సమాచారం

ఒక ఇంట్లో ప్రైమరీ డివైజ్‌కు అనుసంధానం అయిన డివైజుల్లో మాత్రమే ఇకపై పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు డిస్నీ+ అనుమతి ఇవ్వనుంది. వెలుపలి వ్యక్తులు లాగిన్‌ అవ్వడం కుదరదు. ఒకవేళ అలా లాగిన్‌కు ప్రయత్నిస్తే అందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై ఇప్పటికే కెనడా పౌరులకు సమాచారం ఇచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత్‌కు తీసుకొస్తారా? లేదా? అనేది స్పష్టత రాలేదు. ఒకవేళ అదే చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్‌ యూజర్లు పాస్‌వర్డ్‌ షేరింగ్‌ నిలిచిపోనుంది. గతంలో నెట్‌ఫ్లిక్స్‌ సైతం ఇలానే ఇతర దేశాల్లో పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపివేసింది. తర్వాత భారత్‌లోనూ అమలు చేసింది. మరోవైపు అమెజాన్‌ ఆదాయం పెంచుకోవడంలో భాగంగా ప్రైమ్‌ వీడియోలో వచ్చే ఏడాది నుంచి ప్రకటనలు తీసుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని