Disney+ Hotstar: హాట్‌స్టార్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. ఆ కంటెంట్ ఇక బంద్
Disney+ Hotstar OTT: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇకపై హెచ్‌బీఓ కంటెంట్ కనుమరుగు కానుంది. మార్చి 31 నుంచి ప్రసారాలు నిలిచిపోనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) యూజర్లకు బ్యాడ్‌న్యూస్. ఇప్పటికే ఐపీఎల్ ప్రసారాలు దూరం కాగా.. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు అందించే హెచ్‌బీఓ (HBO) కంటెంట్ సైతం కనుమరుగు కానుంది. మార్చి 31 నుంచి ఈ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. డిస్నీ ప్ల్లస్ హాట్‌స్టార్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. హెచ్‌బీఓ కంటెంట్ ఇక హాట్‌స్టార్‌లోఉండబోదని తెలిపింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఇప్పటికే 10 భాషల్లో లక్ష గంటలకు పైగా అందుబాటులో ఉన్న టీవీ షోలు, సినిమాలు, ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్లను ఆనందించొచ్చని ట్వీట్‌లో పేర్కొంది.
హెచ్‌బీఓ ఒరిజినల్ షోలను డిస్నీస్టార్ 2016 నుంచి ప్రసారం చేస్తోంది. ఇందుకోసం హెచ్‌బీఓతో 2015 డిసెంబర్‌లో ఒప్పందం చేసుకుంది. హాట్‌స్టార్ కాస్త 2020లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌గా మారిన తర్వాత కూడా ఈ ఒప్పందం కొనసాగింది. ముఖ్యంగా హెచ్‌బీఓలో ప్రసారం అయ్యే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు భారత్‌లో చాలా మందే అభిమానులు ఉన్నారు. అమెరికాలో ప్రసారం అయ్యే రోజే హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి వచ్చేది. వీటితో పాటు హెచ్‌బీఓలో అందుబాటులో ఉండే హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లను వీక్షించేవారు. ఇకపై హాట్‌స్టార్‌లో ఆ కంటెంట్ లభించదు.
ఖర్చులను తగ్గించుకోవాలని డిస్నీ నిర్ణయించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. మొత్తంగా 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చులను తగ్గించుకోవాలని డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ ఇటీవల నిర్ణయించారు. ఇందులో 3 బిలియన్ డాలర్ల నాన్ స్పోర్ట్స్ కంటెంట్, 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఇతర కంటెంట్‌ను తగ్గించుకోవాలన్నది డిస్నీ వ్యూహం. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఇటీవల 7వేల మంది ఉద్యోగులను కూడా డిస్నీ తొలగించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హక్కులను సైతం ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ వదులుకుంది. హెచ్‌బీఓతో ఒప్పందం వదులుకోవడమూ అందులో భాగమేనని తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Weather Update: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
Crime News
Hyderabad: ఒక్క మిస్డ్ కాల్‌తో రెండు జీవితాలు బలి.. రాజేశ్ మృతి కేసులో కీలక ఆధారాలు
-
India News
Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్
-
Crime News
భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి
-
India News
Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్!: మంత్రి