ఎన్‌సీడీ VS ఎఫ్‌డీ..ఏ పెట్టుబ‌డులు మేలు?

ఎన్‌సీడీలు కంపెనీల ఎఫ్‌డీల‌లో పెట్టుబ‌డుల‌పై బ్యాంకు ఎఫ్‌డీల కంటే రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని గుర్తించాలి..........

Published : 21 Dec 2020 16:17 IST

ఎన్‌సీడీలు కంపెనీల ఎఫ్‌డీల‌లో పెట్టుబ‌డుల‌పై బ్యాంకు ఎఫ్‌డీల కంటే రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని గుర్తించాలి

16 డిసెంబర్ 2019 మధ్యాహ్నం 3:33

మీరు 20 శాతం కంటే త‌క్కువ ప‌న్ను శ్లాబులోకి వ‌స్తే డెట్ ఫోర్ట్‌ఫోలియోలో వైవిధ్య‌త కోసం ఎన్‌సీడీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చు… కానీ, కంపెనీ, రేటింగ్ వంటివి చూసుకొని ప‌రిమిత‌మైన పెట్టుబ‌డులు పెట్టాలి. ఎంత మంచి కంపెనీ అయిన‌ప్ప‌టికీ ఒకే దానిలో ఎన్‌సీడీల‌కు 5 శాతం కంటే ఎక్కువ కేటాయించ‌కూడ‌దు అని నిపుణ‌లు చెప్తున్నారు.

ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ లిమిడెట్ (ఐఎల్ & అండ్ ఎఫ్ఎస్), దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్‌) సంక్షోభం చూసిన త‌ర్వాత నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి త‌గ్గిన‌ప్ప‌టికీ గ‌తేడాదిలో ఈ కొన్ని కంపనీలు రూ.500 కోట్ల విలువైన ఎన్‌సీడీలు జారీచేశాయి. మ‌రో ఎన్‌బీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ గ్రూప్ కి సంబంధించిన ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్ ఎన్‌సీడీల‌ను జారీ చేసేందుకు సెబీ ఆమోదం కోరింది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ డిసెంబ‌ర్ 16 నుంచి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు ఉంటుంది, ముత్తూట్ ఫైనాన్స్ ఎన్‌సీడీ న‌వంబ‌ర్ 28 న ప్రారంభ‌మైంది, డిసెంబ‌ర్ 24 న ముగుస్తుంది. ఎన్‌సీడీలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వ‌డ్డీ రేట్లు ల‌భిస్తుంది. మ‌రి ఇందులో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా?

అధిక రేట్లు, అధిక రిస్క్‌
ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఎన్‌సీడీలపై వ‌డ్డీ రేట్లు వార్షికంగా రిటైల్ పెట్టుబ‌డుదారుల‌కు 8.45 శాతం నుంచి 8.65 శాతం వ‌ర‌కు ఉన్నాయి. ముత్తూట్ ఫైనాన్స్ వ‌డ్డీ రేటు 9.25 నుంచి 10 శాతం వ‌ర‌కు అందించ‌నుంది. ఈ రేట్లు కాల‌ప‌రిమితి, చెల్లింపులపై ఆధార‌ప‌డి ఉంటాయి. వార్షిక చెల్లింపులు అయితే ఎక్కువ‌గా , నెల‌వారిగా అయితే త‌క్కువ‌గా ఉంటాయి.

ఎన్‌సీడీలీతో పోల్చి చూస్తే పెద్ద బ్యాంకులు ఇచ్చే ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఐసీఐసీఐ బ్యాంక్, రెండేళ్ల నుంచి ప‌దేళ్ల‌ లోపు డిపాజిట్ల‌కు 6.4 శాతం వార్షికంగా ఇస్తోంది. ఎస్‌బీఐ ఇదే కాల‌ప‌రిమితికి 6.25 శాతం, పోస్టాఫీస్ డిపాజిట్ల‌పై మూడేళ్లకు 6.9 శాతం, ఐదేళ్ల‌కు 7.7 శాతం వ‌డ్డీ అందిస్తోంది. అయితే ఎఫ్‌డీల కంటే ఎన్‌సీడీల‌లో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే ఎన్‌సీడీల‌ రేట్లు రేటింగ్‌ను బ‌ట్టి వేర్వేరుగా ఉంటాయి. ఇవి క్రెడిట్ రేటింగ్ వంటి అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ ఉదాహ‌ర‌ణ‌కు AA రేటింగ్ ముత్తూట్ ఫైనాన్స్‌కు, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఎన్‌సీడీల‌కు AAA రేటింగ్ ఇచ్చింది. ఎక్కువ రేటింగ్ ఉంటే ఎక్కువ రిస్క్‌ను త‌ట్టుకునే సామ‌ర్ధ్యం ఉంటుంది.

పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా?
ఎన్‌సీడీ ఇష్యూలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, ఎన్‌బీఎఫ్‌సీ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆర్థిక నిపుణులు 20 శాతం కంటే త‌క్కువ ప‌న్ను శ్లాబులోకి వ‌చ్చేవారు రాబ‌డిని పెంచుకునేందుకు ఎన్‌సీడీల‌ను ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని చెప్తున్నారు. మంచి రేటింగ్ ఉన్న ఎన్‌సీడీలు త‌క్కువ‌ శ్లాబు వ‌ర్తించేవారికి మంచి ఆప్ష‌న్ అని చెప్తున్నారు.

ఎఫ్‌డీల‌పై మార్జిన‌ల్ ప‌న్ను రేట్లు విధిస్తారు, అదే ఎన్‌సీలు అయితే 30 శాతం ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేవారికి లాభం ఉండదు. వారికి డెట్ ఫండ్లు స‌రైన‌వి. డెట్ ఫండ్లలో వైవిధ్య పెట్టుబ‌డులు ఉంటాయి. 20 శాతం శ్లాబులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఎన్‌సీడీల‌కు పోర్ట్‌ఫోలియోలో 20 శాతం కంటే ఎక్క‌వ పెట్టుబ‌డులు పెట్ట‌కూడ‌ద‌ని చెప్తున్నారు.

పెట్టుబడి పెట్టడానికి ముందు, సంస్థను ప‌నితీరుఉ పూర్తిగా అంచనా వేయండి. రేట్లు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, AAA రేటింగ్ ఉన్న, బలమైన ఆర్ధికవ్యవస్థ కలిగిన సంస్థల ఎన్‌సీడీలను ఎంచుకోండి. కంపెనీల‌ నిరర్ధక ఆస్తులు, లాభదాయకత‌, పరపతిని పోల్చి చూసుకోవాలి. మెచ్యూరిటీ పూర్త‌య్యేవ‌ర‌కు ఎన్‌సీడీల‌ను కొన‌సాగించాలి.

ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డులు
మీరు తక్కువ పన్ను పరిధిలో ఉంటే, మొదట రిజర్వ్ బ్యాంక్‌ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) చేత బీమా హామీ ఉన్నందును మీరు ఎంచుకున్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులలో ల‌క్ష రూపాయ‌ల‌ వరకు పెట్టుబడి పెట్టవచ్చు. “ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలో, ఒక వ్యక్తి పెట్టుబ‌డులు వైవిధ్యభరితంగా ఉండాలి” అని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత ఎన్‌సిడిల రేట్లు కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అందించే వాటికి దగ్గరగా ఉన్నాయి. జ‌న‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డిపై 8.4% వడ్డీని అందిస్తుంది. అదేవిధంగా, సూర్యోద‌య్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు నుంచి మూడేళ్ల లోపు ఎఫ్‌డీల‌కు 8.5 శాతం, ఐదేళ్లకు 9 శాతం ఆఫ‌ర్ చేస్తోంది. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకుల దీర్ఘకాలిక ఎఫ్‌డి రేట్లు ప్రస్తుత ఎన్‌సిడిలపై కూపన్ రేట్లకు స‌మానంగా ఉన్నాయి.

మరొక ప్రత్యామ్నాయం కంపెనీ ఎఫ్‌డిలలో పెట్టుబడులు పెట్టడం. కానీ, ఇందులో సుర‌క్షితం కాదు, రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మీరు ఎన్‌సిడిలు, కార్పొరేట్ ఎఫ్‌డిలలో పెట్టుబడులు పెడుతున్నారంటే బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంద‌ని గుర్తించాలి. పోస్టాఫీస్‌ డిపాజిట్లు, చిన్న పొదుపు పథకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎఫ్‌డీలు సార్వభౌమ హామీని కలిగి ఉంటాయి, అవి సురక్షితమైనవిగా పరిగణిస్తారు. కాబట్టి కేవ‌లం అధిక వ‌డ్డీ కోసం పెట్టుబ‌డులు పెట్ట‌డం కాకుండా రిస్క్ సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని