Dmart Results: డీమార్ట్‌ నికర లాభం రూ.505 కోట్లు

4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన డీమార్ట్‌.

Published : 13 May 2023 20:42 IST

దిల్లీ: డీమార్ట్‌ పేరిట రిటైల్‌స్టోర్లు నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 8% పెరిగి రూ.505 కోట్లకు చేరుకుంది. ఆదాయం 21% పెరిగింది. గత ఏడాది కాలంలో ఆర్జించిన రూ.8,606.09 కోట్ల ఆదాయంతో పోలిస్తే, 21% పెరిగి రూ.10,337 కోట్లకు చేరుకుంది. దీని నికర లాభం కూడా అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో రూ.466.35 కోట్లతో పోలిస్తే 8% పెరిగి రూ.505.21 కోట్లకు చేరుకుంది. కంపెనీ మార్జిన్లు ఏడాది ప్రాతిపదికన 8.60%తో పోలిస్తే 7.60%కు తగ్గాయి. దీని EBITDA ఆదాయం 5.50% పెరిగి రూ.783 కోట్లకు చేరుకుంది. మే 13న జరిగిన సమావేశంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ బోర్డు ఫలితాలను ఆమోదించినట్లు కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని