ఫండ్ల‌ ఎంపిక ఎలా చేస్తున్నారు?

గ‌త ఏడాది కాలంలో స్మాల్ క్యాప్ ఫండ్ల ప‌నితీరు నిరాశ‌ప‌రిచింది. కానీ ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలిక గ‌డువుతో మంచి రాబ‌డిని ఇస్తాయ‌ని మ‌దుప‌ర్లు గుర్తించాలి....

Published : 21 Dec 2020 16:17 IST

గ‌త ఏడాది కాలంలో స్మాల్ క్యాప్ ఫండ్ల ప‌నితీరు నిరాశ‌ప‌రిచింది. కానీ ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలిక గ‌డువుతో మంచి రాబ‌డిని ఇస్తాయ‌ని మ‌దుప‌ర్లు గుర్తించాలి

15 నవంబర్ 2019 సాయంత్రం 6:13

స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇటీవ‌ల కాలంలో తీవ్ర‌ ప‌రాభావాన్ని చూశాయి. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 9 శాతం న‌ష్ట‌పోయింది. దాదాపుగా స్మాల్ క్యాప్ విభాగంలో స‌గ‌టుగా 2 శాతం రాబ‌డిని మాత్ర‌మే న‌మోదు చేశాయి. కానీ, ఇందుకు విభిన్నంగా యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ గ‌త ఏడాది కాలంలో 22 శాతం రాబ‌డిని న‌మోదుచేసింది.

స్టాక్స్ ఎంపిక వ్యూహాన్ని బ‌ట్టి రాబ‌డి వ‌చ్చింద‌ని ఈ ఫండ్ నిర్వాహ‌కుడు అనుప‌మ్ తివారీ అన్నారు. ఐటీ, కెమిక‌ల్స్, ఆర్థిక రంగాల‌కు సంబంధించిన స్టాక్స్ పెట్టుబ‌డులు లాభాల‌నిస్తాయ‌ని చెప్తున్నారు. స్టాక్‌ల ఎంపిక గురించి చెప్తూ… మంచి కార్పొరేట్ విధానం, వ్యాపారంలో నాణ్య‌త‌, వ్యాపార ప‌నితీరు, సంస్థ విలువ వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని చెప్తున్నారు. కార్పొరేట్ విధానం బాగాలేని సంస్థలను, వ్యాపారాన్ని పెంచే సామర్థ్యం లేదా ఉద్దేశ్యం లేని సంస్థలను మేము పూర్తిగా నిషేదిస్తామ‌ని తెలిపారు.

సముచిత వ్యాపారాలు, రుణ‌ రహిత బ్యాలెన్స్ షీట్లను చూస్తాము. స్టాల్ క్యాప్స్ విభాగంలో ఫండ్ విలువ అనేది చివ‌రి ప్రాధాన్య‌త క‌లిగింది. పైన చెప్పిన మిగ‌తా అంశాల‌ను ముఖ్యంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని చెప్తున్నారు. స్టాక్‌లను త‌గిన‌ ధరకు కొనడానికి ప్రయత్నిస్తాము, దీంతో పాటు వాటిని దీర్ఘకాలికంగా ఉంచుతామని చెప్పారు. స్మాల్ క్యాప్ ఫండ్ ఎదుర్కొనే లిక్విడిటీ రిస్క్‌ను నిర్వహించడానికి మాకు స్టాక్ కేటాయింపు పరిమితి ఉందని ఫండ్ మేనేజర్ వివ‌రించారు.

మ‌దుప‌ర్లు ఏం చేయాలి?
ఒక సంవత్సరం ట్రాక్ రికార్డ్ ద్వారా చూస్తే, ఫండ్ పనితీరు ఆకట్టుకుంటుంది, కాని ఈక్విటీలు పెట్టుబడుల దీర్ఘకాలిక ల‌క్ష్యాల కోసం అనే వాస్తవాన్ని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి. అందువల్ల పెట్టుబడిదారులు ఒక సంవత్సరం పనితీరు ఆధారంగా మాత్రమే ఈక్విటీ ఫండ్లను ఎంచుకోకూడ‌దు. మీరు భవిష్యత్తులో చాలా సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల‌నుకున్న‌ప్పుడు, గతంలో చాలా సంవత్సరాల రాబడిని చూడటం చాలా ముఖ్యం. ఫండ్ ఎంచుకునేందుకు కనీసం ఐదేళ్ల ప‌నితీరును విశ్లేషించండి. అలాగే, పెట్టుబడులు పెట్టడానికి ఫండ్ల‌ను ఎన్నుకునేటప్పుడు రాబడి మాత్రమే ప్రమాణంగా ఉండకూడదు. ఫండ్ పోర్ట్‌ఫోలియోను కూడా నిపుణులు చూడాలి.

ఒక పెట్టుబడిదారుడు ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాల‌నుకుంటే… కేవ‌లం రాబడిని చూడకూడదు, ఫండ్ పోర్ట్‌ఫోలియోను కూడా చూడాలి. ప్రస్తుత యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియో విలువలు అదే విభాగంలో ఇతర ఫండ్ల‌ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక చిన్న క్యాప్ ఫండ్‌గా ఎంచుకోవాల‌నుకుంటే, రిస్క్‌ను సమతుల్యం చేయడానికి తక్కువ విలువలతో మరో ఫండ్‌ను జోడించడం మంచిదని చెప్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని