స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ.. దీర్ఘ‌కాలికంగా లాభాలే !

ఏ మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌లో అయినా కొన్నిసార్లు ప్ర‌తికూల ఫ‌లితాలు రావ‌డం సహ‌జం. అయితే ఇది ఎక్కువ‌కాలం కొన‌సాగ‌ద‌ని విశ్లేష‌కుల వివ‌ర‌ణ‌. ప్ర‌తి నెల‌, మూడు, ఆరు నెల‌ల‌కోసారి మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరులో ప్ర‌తికూల‌త‌లు ఎదుర‌వుతాయి.....

Updated : 02 Jan 2021 14:53 IST

ఏ మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌లో అయినా కొన్నిసార్లు ప్ర‌తికూల ఫ‌లితాలు రావ‌డం సహ‌జం. అయితే ఇది ఎక్కువ‌కాలం కొన‌సాగ‌ద‌ని విశ్లేష‌కుల వివ‌ర‌ణ‌. ప్ర‌తి నెల‌, మూడు, ఆరు నెల‌ల‌కోసారి మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరులో ప్ర‌తికూల‌త‌లు ఎదుర‌వుతాయి. గ‌త ఆరు నెల‌ల్లో లార్జ్‌క్యాప్ విభాగంలో -2.53 శాతం, మిడ్‌క్యాప్‌లో -4.36 శాతం, మ‌ల్టీక్యాప్‌లో -2.66 శాతం, స్మాల్‌క్యాప్ లో -3.54 శాతం, ఈఎల్ఎస్ఎస్‌లో -3.37 శాతం నష్ట‌పోయాయి.

వ‌డ్డీ రేట్లు, చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు, 2019 ఎన్నిక‌లు, మిడ్‌క్యాప్‌ల లాభం త‌గ్గ‌డం వంటి అంశాలు మ్యూచువ‌ల్ ఫండ్లపై ప్ర‌భావం చూపాయ‌ని ఆర్థిక విశ్లేష‌కులు చెప్తున్నారు. దీంతోపాటు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు స్కీముల్లో మార్పు చేయాల్సిందిగా సెబీ కోరడం కూడా ఒక కార‌ణంగా చూపుతున్నారు. సెబీ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు కొన్ని సంస్థ‌లు పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేశాయి.

టెక్నాల‌జీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, లోహ రంగాలు న‌ష్ట‌పోవ‌డంతో మ్యూచువ‌ల్ ఫండ్ల‌పైనా ప్ర‌భావం ప‌డింది. అయితే స్వల్ప‌కాలంలో మార్కెట్లు తిరిగి కోలుకుంటాయ‌ని మ్యూచువ‌ల్ ఫండ్ స‌ల‌హాదారులు విశ్వ‌సిస్తున్నారు. అందుకే ఇప్పుడు కొంత ఒడుదొడుకులున్నా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, దీర్ఘ‌కాలంలో మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు .

మ‌రో రెండు మూడేళ్ల వ‌ర‌కు ఆశించిన లాభాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ, దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణం, ట్యాక్స్‌ల‌ను అధిగ‌మించి మంచిల లాభాల‌ను క‌న‌బ‌రుస్తాయ‌ని భావిస్తున్నారు. క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డులు పెట్టే మ‌దుప‌ర్లు భారీ లాభాల‌ను పొందుతున్న‌ట్లు వివ‌రించారు.

ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్‌టీ, రెరా, దివాలా చ‌ట్టం వంటి ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థికంగా వృద్ధి చెందుతుంద‌ని మ్యూచువ‌ల్ ఫండ్ విశ్లేష‌కులు చెప్తున్నారు. ఎన్‌పీఏ స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్న బ్యాంకుల ప‌నితీరు దివాలా చ‌ట్టంతో మెరుగుప‌డుతుంద‌ని చెప్తున్నారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా వృద్ధి బాట‌లో ప‌య‌నిస్తుంద‌ని వెల్ల‌డించారు.

అయితే మార్కెట్ల ఒడుదొడుకుల‌కు భ‌య‌పడేవారు సిప్‌ల రూపంలో పెట్టుబ‌డులు చేస్తే బాగుంటుంద‌ని వారి సూచ‌న. దీంతో మార్కెట్ల ప్ర‌భావం పెట్టుబ‌డులుపై అంత ప్ర‌భావం చూప‌దు. అదేవిధంగా ఒకే ధ‌ర‌తో మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను కొనుగోలు చేయ‌కుండా మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తే మార్కెట్లు లాభ‌ప‌డిన‌ప్పుడు అధిక లాభాలు వ‌స్తాయి, దీర్ఘ‌కాలంలో మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని వారి భావ‌న‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని