టాప్ 'అప్పు' గురించి తెలుసా!
ఇంటి రుణం తీసుకున్నాక ఇంకే రుణం తీసుకోవడం వీలవుతుందా అని కొంత మంది అనుకుంటుంటారు. అయితే అదే రుణంపై మళ్లీ రుణం పొందే అవకాశం మీకు టాప్ అప్ లోన్ ద్వారా వస్తుంది. ఇళ్లు కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్నారా? కొంత కాలం తరువాత రుణం అవసరం
ఇంటి రుణం తీసుకున్నాక ఇంకే రుణం తీసుకోవడం వీలవుతుందా అని కొంత మంది అనుకుంటుంటారు. అయితే అదే రుణంపై మళ్లీ రుణం పొందే అవకాశం మీకు టాప్ అప్ లోన్ ద్వారా వస్తుంది. ఇళ్లు కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్నారా? కొంత కాలం తరువాత రుణం అవసరం వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి. వ్యక్తిగత రుణాలు తీసుకుందామంటే చాలా వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు గుర్తురావాల్సింది టాప్ అప్ లోన్.
టాప్ అప్ లోన్ అంటే?
టాప్ అప్ లోన్ పేరులో ఉన్నట్లు ఇప్పటికే రుణం తీసుకుని ఉండే దానిపై అదనంగా రుణం పొందటం. ఇదేలా సాధ్యం - ఒక సారి రుణం తీసుకున్నాక మళ్ళీ రుణం తీసుకుందాం అంటే కుదురుతుందా! అది మీ అవసరం బట్టి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రుణం తీసుకోవాలనుకుంటే మాత్రం టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు.ఎందుకంటే ఇందులో గృహరుణానికి వర్తించే వడ్డీ రేటు ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఏలెక్కన చూసినా టాప్ అప్ లోన్ , పర్సనల్ లోన్ కంటే మేలే.
టాప్ అప్ లోన్ ఎలా ఇస్తారు?
దాదాపు అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని కలిపిస్తున్నాయి. గృహ రుణం చెల్లించడం మొదలైన 6 -12 నెలలకు టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అవకాశం కలిపిస్తున్నాయి. ఇంటికి చాలా లోన్ తీసుకున్నాం కదా మళ్ళీ లోన్ కావాలంటే బ్యాంకులు ఇస్తాయా అనే సందేహం వస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ గమనిస్తే మీకు విషయం వివరంగా అర్థమవుతుంది. ఇదెలా అంటే మొత్తం తీసుకున్న గృహరుణం నుంచి తగ్గిన రుణాన్ని తీసివేస్తే వచ్చే మొత్తానికి టాప్ అప్ లోన్ ఇస్తారు. అయితే ఈ కాలంలో సదరు వ్యక్తులకు ఆదాయం పెరగడం ద్వారా రుణ మొత్తం పరిమితి పెరుగుతుంది.
ఈ అంశాన్ని ఒక ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న కిరణ్ వార్షిక వేతనం రూ.10 లక్షలు. అతను ఇంటి రుణం తీసుకుందామని బ్యాంకుకు వెళ్తే అక్కడ ఆయనకు ఆయనకు రుణం రూ.50 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఆయన రూ.45 లక్షలకు రుణం తీసుకున్నారు. మూడేళ్ల పాటు ఈఎమ్ఐలు చెల్లించారు. కొంత కాలానికి అతని రుణం రూ.38 లక్షలకు చేరింది. అతని వేతనం రూ.12 లక్షలు అయింది. అప్పటికి రుణం పొందే పరిమితి అతనికి 55 లక్షలకు పెరిగింది. ఇక్కడ మొత్తం రుణం పరిమితి పెరగడం, అప్పటికే తీసుకున్న రుణం తగ్గడం తో కిరణ్ టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అర్హత పొందాడు.
టాప్ అప్ రుణం లెక్కింపు ( రూ. 55 లక్షలు - రూ.38 లక్షలు = రూ.17లక్షలు )
టాప్ అప్ లోన్ తీసుకునేందుకు గుర్తుంచుకోవాల్సి విషయాలు:
కింద పేర్కొన్న కొన్ని అవసరాలకు టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు:
* ఇంటి పునరుద్ధరణ
* వ్యక్తిగత రుణం
* మరొక ఆస్తిని కొనటానికి
* భూమి కొనుగోలు
* వినియోగ వస్తువుల కొనుగోలు
* పిల్లల వివాహం / విద్య
* వ్యాపార అవసరాలు
* వైద్య ఖర్చులు
పన్ను మినహాయింపు పొందాలంటే?
టాప్ అప్ లోన్ పై పన్ను మినహాయింపు పొందాలంటే ఆ రుణాన్ని ఇంటి పునరుద్ధరణకు ఖర్చు చేస్తేనే లభిస్తుంది.
వడ్డీ రేటు:
సాధారణంగా గృహరుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దానిపై తీసుకునే టాప్ అప్ లోన్ పై వడ్డీ రేటు దానికంటే 1.5-2 శాతం ఎక్కవగా ఉంటుంది. ప్రస్తుతం గృహరుణంపై వడ్డీ రేటు 8.5-9.5 శాతం వరకు ఉంది. దీంతో టాప్ అప్ లోన్ తీసుకుంటే 10-11 శాతాల మధ్యలో రుణం లభిస్తుంది. బయట లభించే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని చెప్పుకోవచ్చు.
తనఖా లేకుండా:
ఇక్కడ ఏవిధమైన ప్రత్యేక తనఖా లేకుండా రుణం పొందవచ్చు. అయితే ఇంటి రుణం తీసుకుంటే ఆ డాక్యుమెంట్లు బ్యాంకుల వద్దనే ఉంటాయి. కాబట్టి ఇంకేమీ తనఖా పెట్టనవసరం లేదు.
టాప్ అప్ లోన్ మొత్తం:
ఈ టాప్ అప్ లోన్ పొందేందుకు రుణ చరిత్ర బాగుండాలి. మీకు రుణం తీసుకునే పరిమితి ఉన్నంత మాత్రాన రుణం లభించదు. మీ పాత చెల్లింపులు తదితరాలను బట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తుంటాయి.
ప్రాసెసింగ్ ఫీజులు:
గృహ రుణం తీసుకునేందుకు అయ్యే ప్రాసెసింగ్ రుసుములే ఇక్కడ కూడా ఉంటాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు గృహరుణంపై తీసుకునే ప్రాసెసింగ్ ఛార్జీలు మొత్తం రుణలో 0.75 శాతం లేదా రూ. 2,000, రెండిట్లో ఏది ఎక్కువుంటే దాన్ని పరిగణిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత