Monkeypox: విదేశీ ప్ర‌యాణ బీమాలో హాస్పిట‌లైజేష‌న్ సౌక‌ర్య‌ముంటుందా?

విదేశాల్లో వైద్య క‌వ‌రేజీని అందించే ప్ర‌యాణ బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం చాలా ముఖ్యం.

Updated : 18 Jul 2022 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మ‌ధ్య‌ విదేశాల్లోనే కాకుండా భార‌త్‌లో కూడా మంకీపాక్స్‌ వైర‌స్ ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ నుంచి విదేశాలకు వెళ్లిన‌వారికి.. ముఖ్యంగా విదేశాల నుంచి భార‌త్‌కు వ‌చ్చే వారిలో కొద్ది మందికి వైర‌స్ ఛాయ‌లు క‌నిపించాయి. ఏదైనా వ్యాధులు లేదా అంటువ్యాధుల‌కు చికిత్స చేయ‌డం వ‌ల్ల క‌లిగిన ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను కవర్ చేయడంలో ఆరోగ్య బీమా పాల‌సీలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. విమాన‌యానం చేసిన ప్ర‌యాణికులు ఈ వ్యాధి నిమిత్తం ఆసుప‌త్రిలో చేరితే బీమా క‌వ‌రేజ్ ఉంటుందా? అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానాంశం.

మీరు విదేశాల‌కు వెళ్లాల‌ని అనుకుంటే.. విదేశాల్లో వైద్య క‌వ‌రేజీని అందించే ప్ర‌యాణ బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం చాలా ముఖ్యం. ఇప్ప‌టికే భార‌త్‌లో మంకీపాక్స్‌ వైర‌స్ కేసు దేశంలో న‌మోదైంది. అదృష్ట‌వ‌శాత్తు దీనివల్ల ప్రాణ హాని తక్కువే. అయిన‌ప్ప‌టికీ కొవిడ్‌-19 మాదిరిగానే ఆసుప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్ల‌యితే, ఆసుప‌త్రిలో చేరే ఖ‌ర్చును భ‌రించ‌డానికి సిద్ధంగా ఉండాలి.

అన్ని అంటువ్యాధులు స‌హా ఈ వ్యాధి కూడా ప్రాథ‌మిక ఆరోగ్య బీమా పాల‌సీ ప‌రిధిలోకి వ‌స్తుంది. అయితే ఒక వ్య‌క్తి ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు నిర్ధార‌ణ అయితేనే అది వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా పాల‌సీ ప‌రిధిలోకి వ‌స్తుంది. ప్ర‌యాణ బీమా పాల‌సీల విష‌యానికొస్తే.. ప‌రిస్థితి అలా ఉండ‌క‌పోవ‌చ్చు. విదేశాల నుంచి భార‌త్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రైనా ఈ అంటువ్యాధి బారిన ప‌డిన‌ట్ల‌యితే ప్ర‌యాణ బీమా క‌వ‌రేజీ అంద‌దు. విదేశాల‌కు వెళ్లేట‌ప్పుడు, స‌రైన ప్ర‌యాణ క‌వ‌ర్‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. త‌గిన ఫీచ‌ర్‌ల‌ను ఎంపిక చేసుకోవాలి.

ఎవ‌రైనా విదేశాల‌కు ప్ర‌యాణిస్తుంటే కొన్ని ట్రావెల్ పాల‌సీలు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం, ఆసుప‌త్రిలో చేర‌డాన్ని మాత్ర‌మే క‌వ‌ర్ చేస్తాయ‌ని గ‌మ‌నించాలి. ఆ పాల‌సీల‌లో హాస్పిట‌లైజేష‌న్ చేర్చ‌లేదు. అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌న‌లో ఆసుప‌త్రిలో చేర‌డం, ఔట్ పేషెంట్ న‌గ‌దు ర‌హిత ఆసుప్ర‌తిలో చేర‌డం వంటి అన్ని అత్య‌వ‌స‌ర వైద్య ఖ‌ర్చులు క‌వ‌ర్ చేయ‌డానికి ఈ ప్ర‌యాణికులు వారి ప్ర‌యాణ విధానాల్లో అలాంటి వైద్య ఖర్చు ఫీచ‌ర్‌ను ఎంచుకోవాలి. అందువ‌ల్ల పాల‌సీ ఫీచ‌ర్లు, మిన‌హాయింపుల‌ను వివ‌రంగా ప‌రిశీలించి త‌గిన క‌వ‌రేజీని నిర్ధారించ‌డానికి బీమా పాల‌సీల‌లో స‌రైన యాడ్‌-ఆన్‌ల‌ను ఎంచుకోవ‌డం మంచిది. క్లుప్తంగా చెప్పాలంటే మీరు విదేశాల‌కు వెళ్లాల‌నే ఆలోచ‌నలో ఉన్న‌ట్ల‌యితే, విదేశాల్లో వైద్య క‌వ‌రేజీని అందించే ప్ర‌యాణ బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం చాలా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని