Surrogate Ads: ‘ఆన్‌లైన్‌ బెట్టింగ్ ప్రకటనలు ప్రదర్శించొద్దు’: కేంద్రం ఆదేశం

ఆన్‌లైన్‌ బెట్టింగ్ ప్లాట్‌ఫాం‌ల ప్రకటనలను ప్రదర్శించడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లు, డిజిటల్‌ మీడియాలో వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ అందజేసే పబ్లిషర్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వేర్వేరుగా సూచనలు జారీ చేసింది.

Published : 03 Oct 2022 22:43 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌(Betting Platforms)ల ప్రకటనలను ప్రదర్శించడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రైవేట్‌ శాటిలైట్ ఛానెళ్లు, డిజిటల్‌ మీడియాలో వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ అందజేసే పబ్లిషర్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌ ఆఫ్‌షోర్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతోపాటు వాటికి సంబంధించిన సరోగేట్‌ వెబ్‌సైట్‌లు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రకటనల(Advertisements)ను ప్రదర్శించొద్దని సమాచార, ప్రసారశాఖ సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

కొన్ని ఆన్‌లైన్ ఆఫ్‌షోర్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు.. తమను తాము ప్రచారం చేసుకునేందుకుగాను న్యూస్‌ వెబ్‌సైట్‌లను సరోగేట్ ఉత్పత్తులుగా ఉపయోగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆ న్యూస్ వెబ్‌సైట్‌ల లోగోలు బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల లోగోలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. ‘సంబంధిత బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, న్యూస్‌ వెబ్‌సైట్‌లు భారత చట్టాల ప్రకారం నమోదై ఉండవు. అవి ప్రకటనల ద్వారా, వార్తల ముసుగులో బెట్టింగ్, జూదాన్ని ప్రోత్సహిస్తున్నాయి’ అని వెల్లడించారు. సంబంధిత చట్టాలు బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రకటనలను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని ప్రకటించాయని, అలాంటి అడ్వర్టయిజ్‌మెంట్‌లను ప్రదర్శించడం మానుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని