Adani Group: జైప్రకాశ్ అసోసియేట్స్ సిమెంట్ యూనిట్‌ను కొనే యోచన లేదు: అదానీ గ్రూప్
ఇప్పటికే హోల్సిమ్ గ్రూప్ అధీనంలోని అంబుజా సిమెంట్స్, ఏసీసీలను కొనుగోలు చేసిన తమకు.. జైప్రకాశ్ అసోసియేట్స్ సిమెంటు వ్యాపారాన్ని కొనే యోచన లేదని అదానీ గ్రూప్ తెలిపింది. ఆ దిశగా వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
దిల్లీ: సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో.. దివాలా స్మృతి ఎదుర్కొంటున్న జేపీ గ్రూప్‌నకు చెందిన సిమెంటు వ్యాపారంలో కూడా వాటాలు కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని పలు పత్రికలు పేర్కొన్నాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. జైప్రకాశ్ అసోసియేట్స్‌కు చెందిన సిమెంటు యూనిట్‌ను కొనుగోలు చేసే అంశం తమ పరిశీలనలో లేదని శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.
ఇప్పటికే హోల్సిమ్ గ్రూప్ అధీనంలోని అంబుజా సిమెంట్స్, ఏసీసీలను కొనుగోలు చేయడం ద్వారా 70 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో, దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్ సంస్థగా అదానీ గ్రూప్ మారింది. 2030 నాటికి సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మి.టన్నులకు పెంచుకునే యత్నాల్లో సంస్థ ఉంది. ఇందులో భాగంగానే జేపీ గ్రూప్‌నకు చెందిన సిమెంట్ వ్యాపారాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గతవారం వార్తలు వచ్చాయి. జేపీ గ్రూప్ నుంచి అల్ట్రాటెక్ కొన్ని యూనిట్లను కొనుగోలు చేయగా, మిగిలిన వాటిని అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకునే యత్నాల్లో ఉందని ఆ వార్తల్లో చెప్పారు.
జేపీ గ్రూప్‌నకు చెందిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్), జేపీవీఎల్ (జైప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్)కు కలిపి 10.55 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన సిమెంటు ప్లాంట్లు, 339 మెగావాట్ల క్యాప్టివ్ విద్యుదుత్పత్తి ప్లాంటు ఉన్నాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షాబాద్ సిమెంటు ప్లాంటు సామర్థ్యాన్ని 1.20 మి.ట. మేర పెంచే ప్రణాళికను ఆ సంస్థ ప్రస్తుతానికి నిలిపేసింది. ఈ సిమెంటు వ్యాపారాల్ని విక్రయిస్తామని జేపీగ్రూప్ సంస్థలు సోమవారం ప్రకటించాయి. జేఏఎల్‌పై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో, రుణభారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. జేపీ గ్రూప్ కంపెనీలైన జేపీ ఇన్ఫ్రాటెక్, ఆంధ్రాసిమెంట్ దివాలా స్మృతిని ఎదుర్కొంటున్నాయి.
మధ్యప్రదేశ్‌లో జేపీ గ్రూప్‌నకు చెందిన నిగ్రీ సిమెంట్ యూనిట్ ఏడాదికి 4 మి.టన్నుల సామర్థ్యంతో నిర్మించినా, ప్రస్తుతం 2 మి.ట. మేర కార్యకలాపాలు సాగిస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఈ యూనిట్‌ను విక్రయించాలని నిర్ణయించినట్లు జేపీ గ్రూప్ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఎవరు కొనుగోలు చేస్తున్నారనేది మరో వారంలో తెలియవచ్చు. ఈ కంపెనీ కోసం అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోందని వార్తలు వచ్చాయి. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌తో పాటు ఇతర ప్రధానేతర ఆస్తుల కొనుగోలుకు అదానీ గ్రూప్ రూ.5,000 కోట్లు వెచ్చించనుందని చెప్పుకొచ్చారు. కానీ, ఆ వార్తలన్నింటినీ తాజాగా అదానీ ఎంటర్ప్రైజెస్ కొట్టిపారేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!
-
Movies News
Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్‌చరణ్
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు