ఆలస్యం కారణం చూపి తిరస్కరించవద్దు: ఐఆర్డీఏఐ
ఆలస్యంగా అందుకునే క్లెయింలపై బీమా సంస్థలు వ్యవహరించాల్సిన తీరుపై ఐఆర్డీఏఐ నిబంధనలు జారీచేసింది.
ఆలస్యంగా చేసే క్లెయింల విషయంలో బీమా సంస్థలు వ్యవహరించాల్సిన శైలిపై ఐఆర్డీఏఐ జూన్ 28న నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్లో జారీచేసిన నిబంధనలను బీమా సంస్థలు తప్పక పాటించాలని ఆదేశాలు జారీచేసింది.
క్లెయిం ఆలస్యం ఎందుకవుతుంది?
క్లెయిం చేసుకునేందుకు పాలసీదారులు ఆలస్యం ఎందుకు చేస్తారు? దీని వెనక కారణాలేమిటి? ఆలస్యంగా చేశారన్న ఒక్క కారణంతో బీమా సంస్థలు క్లెయింను తిరస్కరించవచ్చా? ఈ ఒక్క కారణంతో తిరస్కరించడం అంత సులభం కాదు.
క్లెయిం అవసరం
-
క్లెయిం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు పాలసీదారు వీలైనంత త్వరగా బీమా సంస్థకు తెలియజేయాలి. ఉదాహరణకు ఏదైనా ప్రమాదంలో కారుకు నష్టం వాటిల్లితే ఈ విషయాన్ని బీమా సంస్థకు సాధ్యమైనంత త్వరగా తెలపాలి.
-
అదేవిధంగా ఆరోగ్య బీమా పాలసీ ఉన్న సందర్భంలో ఆసుపత్రిపాలై బిల్లులు కడితే, వెంటనే బీమా సంస్థకు చెప్పి కట్టిన డబ్బులు రీయింబర్స్ చేయించుకోవాలి.
-
క్లెయిం చేసిన వెంటనే బీమా సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టి నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇచ్చేందుకు చూస్తాయి.
-
ఒక డెడ్‌లైన్ అంటూ పెట్టుకోకపోతే బీమా సంస్థలకు తమ ఆదాయ, అప్పులపై ఒక అంచనాకు రాలేరు. అందుకే క్లెయింలకు డెడ్‌లైన్ విధిస్తారు.
-
పాలసీదారులు క్లెయిం చేసుకోవాల్సిన గడువును కొన్ని బీమా సంస్థలు స్పష్టంగా పేర్కొంటాయి.
-
క్లెయిం చేసుకునేందుకు ఎంత గడువు ఉంటుందనే ప్రశ్నను పాలసీదారులు పాలసీ కొనుగోలు చేసే సమయంలోనే అడిగి సమాధానం తెలుసుకోవాలి. ఇది వారి బాధ్యత.
ఉదాహరణకు:
ఆరోగ్య బీమాలో భాగంగా పాలసీ డాక్యుమెంట్లో రీయింబర్స్మెంట్ గురించి ఈ విధంగా ఉంటుంది.
-
ముందే అనుకొని ఆసుపత్రిలో చేరితే రీయింబర్స్మెంట్ కోసం 72 గంటల్లోగా క్లెయిం చేసుకోవాలి.
-
అత్యవసరంగా ఆసుపత్రిలో చేరితే మాత్రం డిశ్చార్జి అయ్యాక 48 గంటలలోపు … ఏ సమయంలోనైనా క్లెయిం చేసుకోవాలి.
-
అదే విధంగా క్లెయిం డాక్యుమెంట్లను 30రోజుల్లోగా సమర్పించాలి.
ఆలస్యంగా పరిగణిస్తారు
-
బీమా సంస్థ క్లెయిం కోసం గడువు విధించినప్పుడు ఆ సమయంలోగా క్లెయిం చేసుకోలేకపోతే ఆలస్యంగా పరిగణిస్తారు.
-
క్లెయిం చేసుకోవడం ఆలస్యమైతే, నియమాల ప్రకారం తిరస్కరించే హక్కు బీమా సంస్థకు ఉంది.
ఐఆర్డీఏఐ చెప్పిందిదే
-
క్లెయిం చేసుకునేందుకు డెడ్‌లైన్ విధించే ప్రాముఖ్యతను ఐఆర్డీఏఐ గుర్తించింది. అదే సమయంలో క్లెయిం ఆలస్యం చేశారన్న నెపంతో బీమా సంస్థలు న్యాయమైన క్లెయింలను తిరస్కరించకుండా ఉండేందుకు కొన్ని నియమాలను రూపొందించింది.
-
క్లెయిం ఆలస్యం చేసినదానికి కారణాలను బీమా సంస్థలు తెలుసుకొని, సరైనదే అని భావించినట్లయితే పరిహారం ఇచ్చేలా చూడాలని ఐఆర్డీఏఐ బీమా సంస్థలకు తెలిపింది.
-
అందకనుగుణంగా ఆలస్యం అయ్యే క్లెయింల విషయంలో బీమా కంపెనీ వ్యవహరించే తీరును పాలసీ డాక్యుమెంట్లలో పేర్కొనాల్సిందిగా ఐఆర్డీఏఐ సూచనలు చేసింది.
-
పాలసీదారు పరిధిలో లేని విషయాల వల్ల క్లెయిం ఆలస్యం గనుక అయితే తిరస్కరించకూడదన్నది ఓ నియమం.
-
క్లెయింల ఆలస్యంపై దృష్టిపెట్టిన ఐఆర్డీఏఐ దీనిపై స్పష్టతనిచ్చి పాలసీదారులకు ప్రయోజనాన్ని చేకూర్చినట్టయ్యింది.
ఐఆర్డీఏఐ చేసిన ఈ తాజా సవరణలు, పెట్టిన నియమనిబంధనలు పాలసీదారులకు అనుకూలంగా ఉండవచ్చు గాక, అనివార్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు సాధ్యమైనంత త్వరగా క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పాలసీదారులకు సూచిస్తున్నాం.
(Source: LiveMint)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు