Ducati: ద్విచక్ర వాహన ధరలు పెంచనున్న డుకాటీ

ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ల సంస్థ డుకాటీ తన ద్విచక్రవాహనాల ధరలను జనవరి నుంచి పెంచనున్నట్టు ప్రకటించింది.

Updated : 19 Dec 2022 21:10 IST

ముంబయి: ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీలన్నీ ధరల పెంపు బాట పట్టాయి. తాజాగా ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ల సంస్థ డుకాటీ (DUCATI) కూడా తన ద్విచక్రవాహనాల ధరలను పెంచనున్నట్టు సోమవారం ప్రకటించింది. జనవరి 1 నుంచి ఈ పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, ఎంతమొత్తం పెంచేదీ వెల్లడించలేదు.

పెరిగిన ధరలను కంపెనీ ఇప్పటి వరకు భరిస్తూ వచ్చిందని, ముడిసరకుల ధరలు పెరిగి ఉత్పత్తి వ్యయం మరింత పెరిగిన నేపథ్యంలో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. దిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, కోచి, హైదరాబాద్‌, కోల్‌కతాలో ఉన్న డీలర్‌షిప్‌ల వద్ద అన్ని మోడళ్లపైనా ధరల పెంపు ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయంగా తీసుకొచ్చే అన్ని మోడళ్లనూ ఇకపై దేశీయ మార్కెట్‌లో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని