ఇ-కాలిక్యులేట‌ర్‌తో ప‌న్ను గురించి సుల‌భంగా తెలుసుకోండి

పాత, కొత్త పన్ను విధానాన్ని పన్నులను పోల్చడానికి ఇ-కాలిక్యులేట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది

Published : 18 Dec 2020 16:03 IST

ఆదాయపు పన్ను చెల్లింపుల్లో రెండు విధానాలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త, పాత విధానాల ద్వారా ఎంత పన్ను కట్టాలో సరిచూసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఈ-కాలిక్యులేటర్‌ను విడుదల చేసింది. ఈ కాలిక్యులేటర్ ద్వారా కొత్త విధానంలో ఎంత కట్టాలో… పాత విధానమైతే ఎంత కట్టాలో చెల్లింపుదారులు పోల్చుకునేందుకు వీలుంటుంది.

పాత, కొత్త విధానాల ద్వారా పన్నులను సరిపోల్చుకునేందుకు టేబుల్‌తో కూడిన ఈ-కాలిక్యులేటర్‌ను ఐటీ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఐటీ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారు. పాత విధానంలో ఎంత ఆదాయానికి పన్ను చెల్లించాలి… కొత్త విధానానికి మారితే ఎంత పన్ను తగ్గుతుంది తదితర వివరాలను ఈ కాలిక్యులేటర్‌తో తెలుసుకోవచ్చు. బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ కాలిక్యులేటర్‌ను తయారుచేశారు.

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆదాయాలు న‌మోదు చేస్తే పాత‌-కొత్త విధానాల్లో ఎంత‌వ‌ర‌కు ఆదా అవుతుందో ఇ-కాలిక్యులేట‌ర్ చూపుతుంది. దీనికోసం https://www.incometaxindiaefiling.gov.in/Tax_Calculator/index.html?lang=eng పై క్లిక్ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని