PPF, SSY మదుపుదారులకు ఇ-పాస్‌బుక్ సదుపాయం.. ఇక పోస్టాఫీసుకు వెళ్లక్కర్లేదు!
పోస్టాఫీసులో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసే వారికి గుడ్‌న్యూస్. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పొదుపు పథకాలకు సంబంధించి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటివి ఇకపై ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: పోస్టాఫీసులో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసే వారికి గుడ్‌న్యూస్. పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పొదుపు పథకాలకు సంబంధించి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటివి ఇకపై ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఈ మేరకు తపాలా శాఖ ఇ-పాస్‌బుక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 12 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
కొత్త సదుపాయం ద్వారా పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్ చేసేవారు తమ ఖాతా వివరాలను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా పొందే వీలుంటుంది. రిజస్టర్ మొబైల్ ద్వారా ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్ లేదా యాప్‌గానీ అవసరం లేదు. ఇందుకోసం ఎటువంటి రుసుమూ వసూలు చేయరని నోటిఫికేషన్‌లో పోస్టల్ శాఖ తెలిపింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఫుల్ స్టేట్‌మెంట్ తెలుసుకోవచ్చు. దీనివల్ల ఆయా సేవల కోసం పోస్టల్‌శాఖకు వెళ్లే పని అవసరం ఉండదు.
ఎలా చేసుకోవచ్చు..?
- ఇ-పాస్‌బుక్ సదుపాయం కోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన www.indiapost.gov.in లేదా www.ippbonline.com వెబ్‌సైట్లను సందర్శించాలి.
- లేదంటే డైరెక్ట్‌గా ఈ https://posbseva.ippbonline.com/indiapost/signin వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- దానిలో ఇ-పాస్‌బుక్ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- అనంతరం మీ మైబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత మీకు కావాల్సినన పథకాన్ని ఎంచుకుని ఖాతా నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి మినీ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫుల్‌స్టేట్‌మెంట్‌ను తెలుసుకోవచ్చు.
- ఒకవేళ మొబైల్ నంబర్ రిజస్టర్డ్ కాకపోతే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఖాతాకు మొబైల్ నంబర్‌ను అనుసంధానించాలి.
బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఈ సదుపాయంతో వినియోగదారులు అన్ని జాతీయ పొదుపు పథకాలకు సంబంధించిన ఖాతాల బ్యాలెన్స్ చూడొచ్చు.
మినీ స్టేట్‌మెంట్: పోస్టాఫీసు పొదుపు ఖాతా (POSA), సుకన్య సమృద్ధి యోజన ఖాతా (SSY), ప్రజా భవిష్య నిధి (PPF) పథకాల మినీ స్టేట్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, ఈ పథకాలకు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ దశలవారీగా ఇతర పథకాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు చెబుతున్నారు. ఇందులో గత 10 లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్‌ను చూడొచ్చు. అలాగే, పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
పూర్తి స్టేట్‌మెంట్: ఈ ఆప్షన్ కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోస్టాఫీసు వెల్లడించింది. కస్టమర్ పేర్కొన్న తేదీ నుంచి ఖాతా స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ
-
Ap-top-news News
Andhra News: మామూళ్లు ఇస్తే కోరిన వేతనం.. ఆయుష్ కాంపౌండర్లకు వాట్సప్ సందేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి
-
India News
Pathaan: ‘పఠాన్’ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు