ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ నామినీని మార్చుకోవ‌చ్చు

ఎన్‌పీఎస్‌లో నామినీని చందాదారుడు ఎప్పుడైనా ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవ‌చ్చు.......

Published : 25 Dec 2020 16:30 IST

ఎన్‌పీఎస్‌లో నామినీని చందాదారుడు ఎప్పుడైనా ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవ‌చ్చు

ఎన్‌పీఎస్ చందాదారుల ప్ర‌యోజ‌నం కోసం పెన్ష‌న్ ఫండ నియంత్ర‌ణ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ డిజిట‌ల్ సంత‌కం (ఇ-సైన్‌) ఆధారిత నామినేష‌న్ స‌దుపాయాన్ని ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఎన్‌పీఎస్ పెట్టుబ‌డుదారులు వారి నామినీని మార్చాల‌నుకుంటే అనుబంధ నోడల్ కార్యాలయాలకు లేదా పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్‌లో ఎస్ 2 ఫారమ్ అభ్యర్థనను సమర్పించాలి.

ఎన్‌పీఎస్ చందాదారుడు మ‌ర‌ణిస్తే మిగిలిన మొత్తం నామినీ లేదా నామినీలు తీసుకోవడానికి అర్హులు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ లేదా పిఎఫ్‌ఆర్‌డిఎ ఈ రికార్డును తమ సిస్టమ్‌లో త్వరగా ప్రవేశపెట్టాలని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలను కోరింది. ఎన్‌పిఎస్ కింద చేసిన నామినేషన్ ఎప్పుడైనా చందాదారుడు స‌వ‌రించుకోవ‌చ్చు.

ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్‌ నామినీని మార్చ‌డం ఎలా?

  • ఎన్‌పీఎస్ చందాదారులు వారి వివ‌రాల‌తో సీఆర్ఏ సిస్ట‌మ్‌కు లాగిన్ అయిన త‌ర్వాత "demographic changes లో ఉండే "update personal details’’ ఆప్ష‌న్ ఎంచుకోవాలి.
  • ఆ త‌ర్వాత '‘add/update nominee detail’'s ఆప్ష‌న్ సెలక్ట్ చేసుకోవాలి
  • నామినీ వివ‌రాలు పేరు, సంబంధం, ఎంత శాతం వాటాను వారికి కేటాయించాల‌నుకుంటున్నారో వంటి వివ‌రాల‌ను అందించాలి
  • ఒక‌సారి వివ‌రాల‌ను పొందుప‌ర్చిన త‌ర్వాత న‌మోదిత మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.
  • ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఇ-సైన్ ఆప్ష‌న్ నిర్ధారించుకోవాలి.
  • అప్పుడు ఇ-సైన్ కోసం ఇ-సిగ్నేచర్ సర్వీస్ ప్రొవైడర్స్ పేజీకి తీసుకెళ్తుంది. అక్క‌డ చందాదారుడు ఆధార్ లేద వ‌ర్చువ‌ల్ ఐడీ ఎంట‌ర్ చేయాలి. త‌ర్వాత ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీని ఎంట‌ర్ చేసీ దృవీక‌రించాలి.
  • ఆ త‌ర్వాత నామినేష‌న్ వివ‌రాలు ఎన్‌పీఎస్ రికార్డుల్లో చేర‌తాయి. ఇ-సైన్ విఫ‌ల‌మ‌యితే ఎప్ప‌టిలాగీ ఫిజిక‌ల్‌గా డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని