ముందే పొదుపు ఆరంభిస్తే ఇంత వ్యత్యాసమా!

ఎక్కువ కాలం డ‌బ్బు పెర‌గాలంటే, మీరు వీలైనంత త్వ‌ర‌గా పొదుపు చేయ‌డం ప్రారంభించాలి.

Updated : 19 Aug 2022 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవీ విరమణ నిధి, పిల్లల చదువు/ పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలు ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఇలాంటి పెద్ద లక్ష్యాల కోసం నిధి సమకూర్చడం తేలికైన పని కాదు. స్వల్ప కాలంలో ఇంత నిధి సమకూర్చడానికి పెట్టుబడులు కూడా భారీగానే అవసరం పడుతుంది. ఇది చాలా మందికి సాధ్యం కూడా కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలం పాటు చిన్న మొత్తం పెట్టుబడితో అదే లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త సులభం. బ్యాంకు వ‌డ్డీ రేట్లు 5.50-6.50% మ‌ధ్య ఉన్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం ఇంతకంటే ఎక్కువే ఉంటోంది. అందుచేత బ్యాంకు పెట్టుబడులతో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి ఆదా చేయడం సాధ్యం కాకపోవచ్చు. మెరుగైన రాబ‌డుల కోసం మ్యూచువ‌ల్ ఫండ్స్‌ వంటి ప్ర‌త్యామ్నాయాల‌ను మ‌దుప‌ర్లు కోరుకుంటున్నారు. వీటిలో రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించాయి.

ముఖ్యంగా చిన్న వయసులో పొదుపు ఆరంభించేవారు త‌క్కువ పెట్టుబడితో ఎక్కువ ప్ర‌తిఫ‌లాన్ని ఎలా పొందొచ్చు అనేది ఉదాహ‌ర‌ణ‌ ద్వారా ఈ కథనంలో తెెలుసుకుందాం. 25, 30, 35 సంవ‌త్స‌రాల వయసు గ‌ల కిరణ్, రవి, రమేష్ ముగ్గురు స‌హోద్యోగులు. 60 సంవ‌త్స‌రాల వయసుకి రూ.5 కోట్ల ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి సమకూర్చాలనుకున్నారు. పెట్టుబడికి సగటు రాబడి 12 శాతం అనుకుంటే, వారు ప్ర‌తి నెలా ఎంతెంత మ‌దుపు చేశారు? లక్ష్యాన్ని చేరుకున్నారా? లేదా?  అనేది తెలుసుకుందాం.

కిరణ్ - వయసు 25 సంవ‌త్స‌రాలు

  • నెలకు కావాల్సిన పెట్టుబడి - రూ.7,700
  • 35 సంవ‌త్స‌రాల‌లో మొత్తం పెట్టే పెట్టుబ‌డి - రూ.32.34 ల‌క్ష‌లు
  • పెట్టుబడిపై లాభం - రూ.4.68 కోట్లు

రవి - వయసు 30 సంవ‌త్స‌రాలు

  • నెలకు కావాల్సిన పెట్టుబడి - రూ.14,100
  • 35 సంవ‌త్స‌రాల‌లో మొత్తం పెట్టే పెట్టుబ‌డి - రూ.50.76 ల‌క్ష‌లు
  • పెట్టుబడిపై లాభం - రూ.4.50 కోట్లు

రమేష్ - వయసు 35 సంవ‌త్స‌రాలు

  • నెలకు కావాల్సిన పెట్టుబడి - రూ.26,500
  • 35 సంవ‌త్స‌రాల‌లో మొత్తం పెట్టే పెట్టుబ‌డి - రూ.79.50 ల‌క్ష‌లు
  • పెట్టుబడిపై లాభం - రూ.4.20 కోట్లు

రూ.5 కోట్ల నిధి సృష్టించడం కోసం కిరణ్.. రమేష్ కంటే నెలకు రూ.18,800 త‌క్కువ ఆదా చేసారు. అంటే, ముందుగా మ‌దుపు చేయ‌డం ప్రారంభించిన వ్య‌క్తి అదే నిధిని 50-75 శాతం త‌క్కువ పొదుపుతో కూడ‌బెట్టారు. ఇద్దరి లాభంలో దాదాపు రూ.48 లక్షల వ్యత్యాసం చూడొచ్చు. ముందుగా పొదుపు చేసిన వారికి ప్ర‌తిఫ‌లం ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. పెట్టుబ‌డికి అవ‌స‌ర‌మైన స‌రైన ప‌థ‌కాన్ని, మొత్తాన్ని అంచ‌నా వేసిన త‌ర్వాత మీ ల‌క్ష్యాల కోసం ఆదా చేయ‌డం ప్రారంభించండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts