EPF Balance: ఈపీఎఫ్‌ న‌గ‌దు బ్యాలెన్స్‌ సులువుగా ఇలా తెలుసుకోండి..

UAN లేకుండా పీఎఫ్‌ న‌గ‌దు నిల్వ‌ ఎంతుందో తెలుసుకోవ‌చ్చు.

Updated : 09 Jul 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌తి నెలా ఉద్యోగి ప్రాథ‌మిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు త‌న వంతుగా చెల్లిస్తాడు. య‌జ‌మాని కూడా స‌మాన‌మైన మొత్తాన్ని జ‌మ చేస్తారు. పీఎఫ్‌కి ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 8.1%గా ఉంది. ఆన్‌లైన్‌లో పీఎఫ్‌కి సంబంధించిన స‌మాచారాన్ని చాలా సుల‌భంగా పీఎఫ్ ఖాతాదారులు తెలుసుకోవచ్చు. బ్యాలన్స్ తెలుసుకోవ‌డానికి వివిధ ప‌ద్ధ‌తులు ఈ కింద ఉన్నాయి. 

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌: ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసిన త‌ర్వాత‌, ఉద్యోగుల సెక్ష‌న్ కింద స‌భ్యుని పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. మీ UAN, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ చేయ‌డం ద్వారా, మీరు పీఎఫ్ పాస్‌బుక్‌ని చూడొచ్చు. ఉద్యోగి, య‌జ‌మాని చెల్లింపులు చేసిన‌ మొత్తాలు బ్యాలెన్స్‌తో పాటు కనిపిస్తాయి. పొందిన పీఎఫ్ వ‌డ్డీ, ఏదైనా పీఎఫ్ బ‌దిలీ మొత్తం ఉంటుంది. ఒకవేళ మీ UANకి ఒక‌టి కంటే ఎక్కువ ప్రావిడెంట్ ఫండ్ నంబ‌ర్లు లింక్‌ అయ్యి ఉంటే అవ‌న్నీ కూడా కనిపిస్తాయి. పీఎఫ్ ఖాతా నిల్వ తెలుసుకోవాలంటే మీరు నిర్దిష్ట స‌భ్యుడి ఐడీపై క్లిక్ చేయాలి.

SMS ద్వారా: మొబైల్‌లో ఈపీఎఫ్ న‌గ‌దు నిల్వ తెలుసుకోవ‌డానికి మీరు SMS సేవ‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించ‌డానికి మీరు 77382 99899 ఫోన్ నంబర్‌కు EPFOHO UAN ENG అని SMS పంపాలి. UAN లేనప్పుడు మీ పీఎఫ్ నిల్వ తెలుసుకోవడానికి SMS సేవలు ఉపయోగ పడతాయి. అయితే, పీఎఫ్ పోర్ట‌ల్‌లో న‌మోదైన మీ మొబైల్ నంబ‌ర్ నుంచి SMS వెళ్లాలి. SMS పంపిన త‌ర్వాత వారి పీఎఫ్‌లో ఆఖ‌రున జ‌మ చేసిన మొత్తం, మీ కేవైసీ వివ‌రాల‌కు సంబంధించిన నిర్ధిష్ట‌ స‌భ్యుడి ఖాతా న‌గ‌దు నిల్వ వివ‌రాల‌ను చూడొచ్చు.

మిస్డ్ కాల్: ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న న‌గ‌దు నిల్వ తెలుసుకోవ‌డానికి మీ మొబైల్ ఫోన్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. దీని కోసం మీకు UAN అవ‌స‌రం లేదు. మీరు ఈపీఎఫ్‌ పోర్ట‌ల్‌లో న‌మోదైన మొబైల్ నంబ‌ర్ నుంచి 011-22901406కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ సేవ ఉచితంగానే ల‌భిస్తుంది. అయితే, మీరు మీ UANకి, మీ బ్యాంకు ఖాతా, ఆధార్ నంబ‌ర్‌, PAN లింక్ చేయాలి. మీ మొబైల్ నంబ‌ర్ కూడా త‌ప్ప‌నిస‌రిగా యూనిఫైడ్ పోర్ట‌ల్‌లో లింక్ చేయాలి.

UMANG APP ద్వారా: యూనిఫైడ్ మొబైల్ అప్లికేష‌న్ ఫ‌ర్ న్యూ-ఏజ్ గ‌వ‌ర్నెన్స్‌ (UMANG APP)ని డౌన్‌లోడ్ చేసుకుని ఖాతాదారుడి పీఎఫ్ నిల్వ‌, క్లెయిమ్ వివ‌రాలు, కేవైసీ స్థితిని తెలుసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని