E-commerce jobs: దీపావళి నాటికి ఇ-కామర్స్‌లో మరో 5 లక్షల ఉద్యోగాలు!

పండగవేళ విక్రయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇ-కామర్స్‌ సంస్థలు డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించుకుంటున్నాయి. దీపావళి కల్లా కొత్తగా మరో ఐదు లక్షల మందిని నియమించుకోవచ్చని ప్రముక నివేదిక తెలిపింది.

Updated : 07 Oct 2022 11:34 IST

దిల్లీ: పండగ వేళ విక్రయాలు ఊపందుకున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా ఇ-కామర్స్‌ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది కొత్త సిబ్బందిని నియమించుకున్నట్లు టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది. దీపావళి నాటికి మరో ఐదు లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. 

‘గిగ్‌ వర్కర్లు’గా పిలిచే డెలివరీ బాయ్స్‌ వంటి స్వల్పకాలిక ఉద్యోగులకు డిమాండ్‌ బాగా పెరిగిందని నివేదిక తెలిపింది. కేవలం టైర్‌-1 పట్టణాల్లోనే కాకుండా టైర్‌-2, 3 పట్టణాల్లోనూ నియామకాలు 40 శాతం పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ రంగంలోనూ సిబ్బంది కొరత ఉందని.. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ రంగంలోని కంపెనీలు దాదాపు ఎనిమిది లక్షల మంది సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కేవలం డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకే కాకుండా క్విక్‌ కామర్స్‌, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌, రిటైల్‌ స్టోర్లు, ఎఫ్‌ఎంసీజీ, ఫూట్స్‌-ఆన్‌-స్ట్రీట్‌లో సేల్స్‌మెన్‌కు గిరాకీ భారీగా ఉందని వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts