ED raids against Vivo: దేశవ్యాప్తంగా వివో కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ED raids against Vivo: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వివో (Vivo) సంస్థ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మంగళవారం సోదాలు నిర్వహిస్తోంది.

Updated : 05 Jul 2022 13:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వివో (Vivo) సంస్థ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మంగళవారం సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 44 చోట్ల వివో, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఈ సోదాలు జరుపుతోంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈడీ దాడులపై వివో తన స్పందన తెలిజేయలేదు. మరోవైపు చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీలపై ఇప్పటికే కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాకు చెందిన షావోమికి చెందిన ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది. అక్రమంగా విదేశాలకు నిధులు మళ్లించిందన్న కారణంతో రూ.5,551.27 కోట్లు నిల్వలు ఉన్న ఖాతాలను సీజ్‌ చేసింది. అంతకుముందు ఒప్పో, వన్‌ప్లస్‌, జడ్‌టీఈ సంస్థల కార్యాలయాలపైనా ఈ సోదాలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు