Cryptocurrency: ఫీజు కింద క్రిప్టోకరెన్సీని స్వీకరిస్తాం: బ్రైట్‌ఛాంప్స్‌

ఫీజు చెల్లింపుల కింద క్రిప్టోకరెన్సీలను స్వీకరిస్తామని గోవా కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్‌టెక్‌ అంకుర సంస్థ బ్రైట్‌ఛాంప్స్‌ ప్రకటించింది....

Published : 22 Feb 2022 21:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫీజు చెల్లింపుల కింద క్రిప్టోకరెన్సీలను స్వీకరిస్తామని గోవా కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్‌టెక్‌ అంకుర సంస్థ బ్రైట్‌ఛాంప్స్‌ ప్రకటించింది. తమ సేవలు వివస్తరించిన అమెరికా, కెనడా, యూఏఈ, నైజీరియా, మలేషియా, థాయ్‌లాండ్‌ సహా దాదాపు 30 దేశాల్లో క్రిప్టోలతో చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. భారత్‌లోనూ క్రిప్టోలను స్వీకరిస్తామని స్పస్టం చేసింది.

సురక్షితమైన క్రిప్టో లావాదేవీల నిమిత్తం తాము క్రిప్టో పేమెంట్‌ గేట్‌వే ట్రిపుల్‌ఏతో చేతులు కలిపినట్లు బ్రైట్‌ఛాంప్స్‌ తెలిపింది. ఈ మాధ్యమంలో చెల్లింపులు చేసేవారికి ట్రిపుల్‌ఏ మెరుగైన ఎక్స్ఛేంజ్‌ రేట్లను అందజేస్తుందని పేర్కొంది. బ్రైట్‌ఛాంప్స్‌ ఇటీవలే 8-16 ఏళ్ల మధ్య పిల్లలకు ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించే ఎడ్యుకేషన్‌ 10ఎక్స్‌ అనే సంస్థను కొనుగోలు చేసింది. బ్రైట్‌ఛాంప్స్‌ విలువ 500 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జీఎస్వీ వెంచర్స్‌, సింగపూర్‌కు చెందిన బీనెక్ట్స్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ మద్దతు ఉన్న క్యాపిటల్‌ ఫ్రమ్‌ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు బ్రైట్‌ఛాంప్స్‌లో పెట్టుబడి పెట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు