పొదుపులో ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ఎలా ఉంటుంది?

ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా రూపాయి కొనుగోలు శ‌క్తి త‌గ్గుతూనే ఉంటుంది.

Published : 23 Apr 2022 13:12 IST

వ‌య‌స్సులో సంపాద‌న ఉంటుంది, ఖ‌ర్చు ఉంటుంది. కానీ వృద్దాప్యంలో ఖ‌ర్చే గాని సంపాద‌న ఉండ‌దు. వృద్దాప్యంలో బ్ర‌త‌క‌డానికి డ‌బ్బు అవ‌స‌రం పడుతుంది. దీనికి నిధి పోగేయాలి అనుకునేవారు ఎంత వ‌ర‌కు దాయాలి అనేది తెలుసుకోవాలంటే ఇప్ప‌టి ద్ర‌వ్యోల్బ‌ణం, భ‌విష్య‌త్తులో పెరిగే ద్ర‌వ్యోల్బ‌ణం, ఇవ‌న్నీ లెక్క‌లు వేసుకోవాలి. అంతేకాకుండా అప్ప‌టి జీవ‌న వ్య‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అంతేగాక వృద్ధాప్యంలో అనారోగ్యాలు చుట్టుముడ‌తాయి. ఈ ఖ‌ర్చులు ఎంత‌వ‌ర‌కు తీసుకెళ‌తాయ‌నే దాని మీద క‌నీసం అంచ‌నా కూడా క‌ట్ట‌లేము. కానీ ఎవ‌రైనా 60 ఏళ్ల త‌ర్వాత ఖ‌ర్చుపెట్ట‌డానికి నిధిని పోగేయ్యాల్సిందే. 

ఒక వ్య‌క్తికి 30 సంవ‌త్స‌రాలు, 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు త‌ర్వాత జీవించ‌డానికి డ‌బ్బులు పొదుపు చేసి కోటి రూపాయ‌లు నిధిని సమకూర్చాలనుకుంటున్నాడు అనుకోండి. 30 ఏళ్ల త‌ర్వాత ఈ మొత్తం చాలా త‌క్కువ‌. పొదుపు చేసిన కోటిని ద్ర‌వ్యోల్బ‌ణ‌మే తినేస్తుంది. ఉదా: మీరు 30 ఏళ్ల దూరంలో ఉన్న ల‌క్ష్యం కోసం రూ. 1 కోటి ఆదా చేసేందుకు పెట్టుబ‌డి పెడితే 30 ఏళ్ల త‌ర్వాత రూ. 1 కోటి విలువ ఇప్పటి ప్రకారం రూ. 23 ల‌క్ష‌లు అవుతుంది. 

ధ‌ర‌ల పెరుగుద‌ల అంశాలు ల‌క్ష్యాల స్థాయిని పెంచుతూనే ఉంటాయి. ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా రూపాయి కొనుగోలు శ‌క్తి త‌గ్గుతూనే ఉంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావాన్ని భ‌ర్తీ చేయ‌డానికి మీరు పెరిగే ధ‌రల కోసం ఆదా చేయాలి. కాని మ‌న ల‌క్ష్యం నేటి ఖ‌ర్చుల‌తో లెక్క‌లు వేసుకుంటాం. ఇలా వేసుకుంటే భ‌విష్య‌త్తులో ఆర్ధికంగా దెబ్బ‌తిన్న‌ట్లే. 

దీర్ఘ‌కాలం పాటు పొదుపు చేయ‌డం ప్రారంభించ‌డానికి, గ‌ణ‌నీయ‌మైన నిధిని సృష్టించ‌డానికి, మీరు చేయ‌వ‌ల‌సిన అనేక విష‌యాలు ఉన్నాయి. మీరు ముందుగానే ఆదా చేయ‌డం ప్రారంభించ‌డ‌మే కాకుండా, స‌రైన ఆస్తి కేటాయింపుతో మీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను కూడా నిర్మించుకోవాలి. ఈ రోజు రూ. 1 కోటి విలువున్న‌ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి మీకు 30 ఏళ్ల త‌ర్వాత పొదుపు చేయాల్సిన నిధి దాదాపు రూ. 4.32 కోట్లు. ఈ నిధి ఇప్ప‌టి రూ. 1 కోటితో స‌మానం.

ద్ర‌వ్యోల్బ‌ణం 5% ఉన్న‌ప్పుడు, 10 ఏళ్ల త‌ర్వాత రూ. 25 ల‌క్ష‌ల విలువ‌గ‌ల నిధిని సమకూర్చాలనుకుంటే, రూ. 25 ల‌క్ష‌లు కాకుండా రూ. 40.72 ల‌క్ష‌లు ఆదా చేసుకోవాలి. బ్యాంకుల్లో వ‌డ్డీ రేట్లు 5-6% మ‌ధ్య ఉన్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం కూడా బ్యాంక్ వ‌డ్డీ రేట్ల‌తో స‌మానంగా ఉంటుంది. అందుచేత బ్యాంకుల్లో పొదుపు చేస్తే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి ఆదా చేయ‌గ‌ల‌మా అంటే ప్ర‌శ్నార్ధ‌క‌మే. ఈ బ్యాంక్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు పెరుగుద‌ల త‌క్కువ‌గా ఉండ‌టంతో మెరుగైన రాబ‌డుల కోసం పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు మ‌దుపుదార్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఈక్విటీల వంటి ప్ర‌త్యామ్నాయాల‌ను మదుపరులు కోరుకుంటున్నారు. వీటిలో రిస్క్ ఉన్నా అసాధార‌ణ‌మైన వృద్ధిని గత కొద్ది కొన్ని సంవ‌త్స‌రాల నుంచి క‌న‌బ‌రిచాయి. అయితే, వీటిలో పెట్టుబ‌డి పెట్టేవారు మార్కెట్ల‌ను బాగా విశ్లేష‌ణ  చేయాల్సి ఉంటుంది.  ఇందులో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని