Online Transactions: సురక్షితమైన లావాదేవీల కోసం ఎస్‌బీఐ కీలక సూచనలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం సమగ్ర డిజిటల్ భద్రతా మార్గదర్శకాలతో ముందుకు వచ్చింది....

Updated : 25 Apr 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో డిజిటల్‌ లావాదేవీలు భారీ ఎత్తున పుంజుకుంటున్నాయి. అదే సమయంలో సైబర్‌ మోసాలు సైతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ వినియోగదారుల కోసం సమగ్ర డిజిటల్ భద్రతా మార్గదర్శకాలతో ముందుకు వచ్చింది. సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది.

ఇంటర్నెట్‌ భద్రతకు మూడు అంశాలు..

* బ్యాంకు వెబ్‌సైట్‌ అడ్రస్‌బార్‌లో ‘హెచ్‌టీటీపీఎస్‌’ (https) తప్పనిసరిగా ఉండాలి.

* ఓపెన్‌ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా సామూహిక ప్రదేశాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపొద్దు.

* మీ పని పూర్తికాగానే బ్రౌజర్‌ నుంచి లాగౌట్‌ అయి క్లోజ్‌ చేయాలి.

సురక్షితమైన లాగిన్‌ కోసం..

* ప్రత్యేకమైన, క్లిష్టమైన పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి.

* పాస్‌వర్డ్‌లను తరచూ మార్చాలి.

* ఐడీ, పాస్‌వర్డ్‌, పిన్‌ వంటి వివరాలను ఎవరికీ తెలియజేయొద్దు. ఎక్కడా రాసిపెట్టొద్దు. ఎక్కడా సేవ్‌ చేసి పెట్టొద్దు.

* బ్యాంకు మిమ్మల్ని ఎప్పుడూ యూజర్‌ ఐడీ/పాస్‌వర్డ్‌/కార్డ్‌ నెంబరు/పిన్‌/సీవీవీ/ఓటీపీ వంటి వివరాలను అడగదని గుర్తుంచుకోవాలి.

* మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో దానంతట అదే పాస్‌వర్డ్‌ల వంటి కీలక వివరాలను సేవ్‌ చేసుకునే ‘ఆటో సేవ్‌’, ‘రిమెంబర్‌’ వంటి ఫంక్షన్లను డిజేబుల్‌ చేయాలి.

క్రెడిట్‌/డెబిట్‌ కార్డు భద్రత కోసం..

* ఏటీఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (POS) వద్ద లావాదేవీలు జరిపేటప్పుడు చుట్టుపక్కల పరిసరాలను నిశితంగా పరిశీలించాలి.

* పిన్‌ ఎంటర్‌ చేసేటప్పుడు కీప్యాడ్‌ను కవర్‌ చేయాలి.

* ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఎంతవరకు నిజమైనవో నిర్ధరించుకోవాలి.

* డెబిట్‌ కార్డు లావాదేవీలను ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు అనుసంధానించాలి.

* ఏటీఎం, పీఓఎస్‌, ఈ-కామర్స్‌ సైట్లలో లావాదేవీలకు పరిమితిని విధించండి.

యూపీఐ భద్రత కోసం..

* మొబైల్‌ పిన్‌, యూపీఐ పిన్‌ వేర్వేరుగా ఉండాలి.

* అపరిచిత యూపీఐ రిక్వెస్ట్‌లకు స్పందించొద్దు.

* నకిలీ రిక్వెస్ట్‌లను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాలి.

* నగదు బదిలీకి మాత్రమే పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. రిసీవ్‌ చేసుకోవడానికి అవసరం లేదు.

* మీ ప్రమేయం లేకుండా ఏదైనా లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే మీ ఖాతాలో యూపీఐ సేవలను డిజేబుల్‌ చేయండి.

నిత్యం సామాజిక ఖాతాలో యాక్టివ్‌గా ఉండే ఎస్‌బీఐ.. కస్టమర్ల భద్రత, వారి సురక్షితమైన లావాదేవీల నిమిత్తం ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుంటుంది. సైబర్‌ మోసాలపై అప్రమత్తం చేస్తూంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిజేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని