Ola Electric: జులైలోనూ తగ్గిన ఓలా విక్రయాలు.. ఒకినావా దూకుడు హీరో బ్రేక్‌!

Electric 2 wheelesr sales report: ఓలా ఎలక్ట్రిక్‌ విక్రయాలు మరోసారి క్షీణించాయి. 

Published : 06 Aug 2022 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాల్లో సంచలనానికి మారుపేరుగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) విక్రయాలు మరోసారి క్షీణించాయి. జూన్‌లో 5,874 వాహనాలు విక్రయించిన ఓలా సంస్థ.. జులైలో కేవలం 3,426 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత నెలతో పోలిస్తే విక్రయాలు 42 శాతం తగ్గాయి. కొన్ని నెలలుగా విక్రయాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన ఒకినావా ఆటో టెక్‌కు దూకుడుకు హీరో ఎలక్ట్రిక్‌ బ్రేకులు వేసింది. సేల్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (FADA) వెలువరించిన డేటాలో వెల్లడైంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 12,691 వాహన విక్రయాలతో ఓలా ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. మే నెల నుంచి ఆ కంపెనీ వాహన అమ్మకాలు క్షీణించడం మొదలయ్యాయి. దీంతో ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన ఆ కంపెనీ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక జులై నెలకు సంబంధించిన విక్రయాల్లో హీరో ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో నిలిచింది. 8,679 వాహనాలతో అగ్రస్థానం దక్కించుకుంది. గత నెలతో పోలిస్తే 14.5 శాతం విక్రయాలు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో ఒకినావా ఆటో టెక్‌ 7,999 వాహనాలను విక్రయించింది. 6,106 వాహన విక్రయాలతో ఏంపియర్‌ మూడో స్థానంలో నిలిచింది. హీరో మోటోకార్ప్‌కు చెందిన ఏథర్‌ ఎనర్జీ సేల్స్‌ సైతం 68.6 శాతం వృద్ధితో 1,192 వాహనాలను విక్రయించింది. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని