Updated : 28 Jan 2022 13:21 IST

`ఏఎంఓ` మొబిలిటీ నుండి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉత్ప‌త్తులు ఎక్కువయ్యాయి. పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు వాయు వేగంతో పెర‌గ‌డంతో వాహ‌న ప్రియుల ఆస‌క్తి అంతా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల మీద పడింది. మోటారు కంపెనీలు కూడా పెద్ద మార్కెట్ అయిన భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు విడుద‌ల చేయ‌డంపై దృష్టి పెట్టాయి. ఉత్త‌రాది `నొయిడా`కు చెందిన `ఏఎంఓ` మొబిలిటీ వ‌చ్చే వారం హై-స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేయ‌నుంది.

ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ. దూరం వ‌ర‌కు వెళ్ల‌గ‌లిగే సామ‌ర్ద్యం దీనికి ఉంది. ఈ ఫిబ్ర‌వ‌రి నెల ప్రారంభంలో `ఏఎంఓ` మొబిలిటీ కొత్త ఉత్ప‌త్తుల‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి, ఉత్ప‌త్తి సామర్ధ్యాన్ని విస్త‌రించ‌డానికి `ఆర్ అండ్ డీ`ని పెంచాల‌ని చూస్తోంది. పెట్టుబ‌డి నిమ్మిత్తం, వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రంలో సుమారు 100 మిలియ‌న్ డాల‌ర్ల నిధులు సేక‌రించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.

భార‌త రోడ్ల‌లో ట్రాఫిక్ స్పీడ్ త‌గ్గిపోతున్నందున త‌క్కువ స్పీడ్ క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూటర్స్‌ని  కొనుగోలు చేయ‌డానికి జ‌నాలు ఆస‌క్తి చూపుతున్నందున ఆ వాహ‌నాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి కంపెనీ రంగం సిద్దం చేస్తోంది. ఈ త‌క్కువ స్పీడ్ క‌లిగిన స్కూట‌ర్‌ల‌కు రిజిస్ట్రేష‌న్ ప్లేట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవ‌స‌రం లేదు. మార్కెట్‌లో త‌క్కువ స్పీడ్ స్కూట‌ర్‌ల‌ను కొనుగోలు చేయ‌డానికి కూడా పెద్ద సంఖ్య‌లో సిద్దంగా ఉన్నారు.

20% త‌క్కువ స్పీడ్ యూనిట్‌లు, 80% హై-స్పీడ్ వాహ‌నాల‌ను త‌యారు చేయ‌డానికి కంపెనీ సిద్ధప‌డుతోంది. `ఏఎంఓ` ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఈ ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో హై-స్పీడ్ కేట‌గిరిలో కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి కంపెనీ సిద్ద‌మ‌వుతోంది. రాబోయే స్కూట‌ర్ గ‌రిష్టంగా 50 కి.మీ. వేగాన్ని క‌లిగి ఉంటుంది. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 120-130 కి.మీల దూరం రేంజ్ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ చెబుతుంది. ఇది స్థిర‌మైన‌, పోర్ట‌బుల్ బ్యాట‌రీ ప్యాక్ ఎంపిక‌ను క‌లిగి ఉంటుంది.

`ఏఎంఓ` మొబిలిటీ 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికం నాటికి 4 నుంచి 6 కొత్త వాహ‌న ఉత్ప‌త్తుల‌ను ప్రారంభించాల‌ని యోచిస్తోంది. ఇది ప్ర‌స్తుతం 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల‌లో 150 ట‌చ్ పాయింట్‌ల డీల‌ర్‌షిప్ నెట్‌వ‌ర్క్ ద్వారా 4 ర‌కాల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విక్ర‌యిస్తోంది. కొన్ని కంపెనీల వాహ‌నాల‌ను ఛార్జింగ్ చేస్తున్న‌పుడు చిన్న ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌లో మంట‌లు చేల‌రేగిన సంద‌ర్భాలు ఈ మ‌ధ్య‌న బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇవ‌న్నీ తాత్కాలికమని, ఇంట్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల బ్యాట‌రీ ఛార్జ్ చేయ‌డం సుర‌క్షిత‌మేన‌ని, మోబైల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టినంత సుల‌భంగా ఈ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ఛార్జింగ్ చేయ‌వ‌చ్చ‌ని, అధీకృత ఛార్జింగ్ ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించి ఛార్జింగ్ చేయాల‌ని కంపెనీ పేర్కొంది. విక్ర‌య స‌మ‌యంలోనే వినియోగ‌దారుల‌కు ఛార్జింగ్ విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని కంపెనీ తెలిపింది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విడి భాగాలు, ఈ వాహ‌నాల‌కు కీల‌క‌మైన బ్యాట‌రీల‌పై ఈ బడ్జెట్‌లో జీఎస్‌టీ త‌గ్గిస్తే ఈ రంగం భారీ ఉపాధి క‌ల్పించే సెక్టార్‌గా ఉండ‌గ‌ల‌ద‌ని కంపెనీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్