Electric Two-Wheelers: జులైలో మళ్లీ తగ్గిన ఇ-స్కూటర్ల రిజిస్ట్రేషన్లు

Electric Two-Wheelers: విద్యుత్తు ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు జులై నెలలో నెమ్మదించాయి...

Published : 01 Aug 2022 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్తు ద్విచక్ర వాహన (Electric Two-Wheelers - E2W) తయారీలో అగ్రపథాన ఉన్న తొలి ఎనిమిది కంపెనీల్లో ఐదు సంస్థల్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయని వాహన్‌ పోర్టల్‌ గణాంకాలు వెల్లడించాయి. జూన్‌తో పోలిస్తే జులై నెలలో 5 శాతం తగ్గి 32,450 యూనిట్లకు చేరాయి. ఓలా ఎలక్ట్రిక్‌, ఏథర్‌ ఎనర్జీ, యాంపియర్‌, రివోల్ట్‌, ప్యూర్‌ ఈవీ వంటి ప్రముఖ కంపెనీల్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయి.

పెట్రోల్‌ ద్విచక్రవాహన విక్రయాలతో పోలిస్తే ఈవీ టూవీలర్స్‌ (Electric Two-Wheelers - E2W) రిజిస్ట్రేషన్లలో తగ్గుదల తక్కువగానే నమోదు కావడం గమనార్హం. అయినప్పటికీ..దేశంలో ఈవీ పురోగమిస్తోందనుకుంటున్న తరుణంలో తగ్గుదల నమోదుకావడం పరిశ్రమ వర్గాల్ని ఆందోళన కలిగిస్తోంది. సంప్రదాయ వాహనాల నుంచి విద్యుత్తు వాహనాలకు మారడం తయారీ సంస్థలు అంచనా కన్నా నెమ్మదిగా సాగుతోందని తెలుస్తోంది. 2025 నాటికి మార్కెట్‌లో పూర్తిగా విద్యుత్తు ద్విచక్రవాహనాలే ఉంటాయని ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ గతంలో అంచనా వేశారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నొమురా మాత్రం 2030 నాటికి రోడ్లపై తిరిగే ద్విచక్రవాహనాల్లో 30 శాతం విద్యుత్తువి ఉంటాయని తెలిపింది. 

జనవరిలో మార్కెట్‌లోని మొత్తం టూవీలర్స్‌లో 2.6 శాతం విద్యుత్తు ద్విచక్రవాహనాలున్నాయి. ఏప్రిల్‌లో ఆ వాటా 3.63 శాతానికి పెరిగింది. ఆ నెల ఈవీ విక్రయాల్లో మెరుగైన గణాంకాలు నమోదయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్‌ రికార్డు స్థాయిలో 12,702 వాహనాలను విక్రయించింది. మొత్తంగా ఆ నెలలో 43,098 వాహన రిజిస్ట్రేషన్లను నమోదయ్యాయి. కానీ, మే నెలలో వాటా 2.81 శాతానికి పడిపోయింది. జూన్‌లో తిరిగి 3.3 శాతానికి చేరినప్పటికీ.. జులైలో మళ్లీ 3.1 శాతానికి తగ్గింది. ఈ2వీ తయారీ కంపెనీలు 2022లో 7.50 లక్షల వాహనాలను విక్రయించాలని ఆశించాయి. కానీ, తొలి ఏడు నెలల్లో దాదాపు 2.60 లక్షల వాహనాలను మాత్రమే విక్రయించగలిగాయి. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రతినెలా లక్ష వాహనాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉంది.

జూన్‌, జులై నెల వాహన రిజిస్ట్రేషన్లు...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు