Elin Electronics IPO: డిసెంబరు 20న ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ
Elin Electronics IPO: ఎలిన్ ఎలక్ట్రానిక్స్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తోంది. లైటింగ్, ఫ్యాన్లు, స్విచ్‌ల వంటి కంపెనీలకు ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ డిసెంబరు 20న ప్రారంభం కానుంది.
దిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ (Elin Electronics IPO) డిసెంబరు 20న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కొనసాగే షేర్ల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ డిసెంబరు 22న ముగుస్తుంది. ఈ కంపెనీ తొలుత రూ.760 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా దాన్ని రూ.475 కోట్లకు కుదించింది. ఇందులో రూ.175 కోట్లు విలువ చేసే తాజా షేర్లు ఉండనున్నాయి. మిగిలిన రూ.300 కోట్లు పలు ప్రమోటర్లు, వాటాదారుల వాటాల నుంచి విక్రయించనున్నారు.
తాజా ఐపీఓ (Elin Electronics IPO)లో సమీకరించిన నిధుల్లో కొంత భాగాన్ని రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు, ఆధునికీకరించేందుకు మరికొన్ని నిధుల్ని వెచ్చించనున్నారు. ఈ కంపెనీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్, గోవాలోని వెర్నాలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మరికొన్ని నిధుల్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కూడా వినియోగించనున్నారు. యాక్సిస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ ఈ ఐపీఓ (Elin Electronics IPO)కి లీడ్ మేనేజర్లు వ్యవహరిస్తున్నాయి.
దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఎలిన్ ఎలక్ట్రానిక్స్ (Elin Electronics) లైటింగ్, ఫ్యాన్స్, వంట గదికి సంబంధించిన వస్తువుల్ని తయారు చేసే అనేక ప్రముఖ కంపెనీలకు ఎలక్ట్రానిక్స్ పరికరాలను అందజేస్తోంది. అలాగే ఫ్రాక్షనల్ హెచ్‌పీ మోటార్లను సైతం ఉత్పత్తి చేస్తోంది. ఎల్ఈడీ లైటింగ్, ఫ్యాన్లు, స్విచ్‌లు, వైద్య పరీక్షల కాట్రిడ్జ్‌లు సహా ఇతర ఉత్పత్తులు ఈ కంపెనీ తయారీ జాబితాలో ఉన్నాయి.
ఈ వారంలో మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. సులా వైన్యార్డ్స్ ఐపీఓ (sula vineyards IPO) సోమవారం ప్రారంభమై నేటితో ముగిసింది. మరోవైపు అబాన్స్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ (Abans Holdings IPO) సైతం సోమవారమే ప్రారంభమైంది. రేపటితో ముగియనుంది. మరోవైపు ల్యాండ్‌మార్క్ కార్స్ ఐపీఓ (Landmark Cars IPO) మంగళవారం మొదలైంది. రేపటితో ముగియనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!