Twitter: మరో ఆరు వారాల్లో ట్విటర్‌కు కొత్త సీఈఓ: ఎలాన్‌ మస్క్‌

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ సీఈఓగా కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

Updated : 12 May 2023 10:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ సీఈఓగా కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఈ  మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప.. ఆమె ఎవరనే విషయాన్ని మాత్రం మస్క్‌ చెప్పలేదు. ట్విటర్‌ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత తాను చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (సీటీఓ), ప్రొడక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ విభాగాల బాధ్యతలు చూసుకోనున్నట్లు ట్వీట్‌లో  ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని