Elon Musk: మళ్లీ మస్కే నంబర్‌1.. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానం

Elon Musk: బ్లూమ్‌బర్గ్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మాస్క్‌ మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.

Published : 19 Jun 2024 17:18 IST

Elon Musk | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుల జాబితా(World's Richest People)లో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ (Bloomberg) బిలియనీర్‌ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్‌ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. 205 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెజోస్‌(Jeff Bezos), 199 బిలియన్‌ డాలర్లతో బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ (Bernard Arnault) తర్వాతి స్థానంలో నిలిచారు. చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంతో మస్క్‌ తిరిగి మొదటి స్థానంలో నిలిచారు.

అక్కడికి బదిలీ అయితే రూ.8 లక్షల ప్రోత్సాహకం.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ ఆఫర్‌

ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో మస్క్‌ వేతన ప్యాకేజీకి ఆమోదముద్ర పడింది. 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీంతో టెస్లా షేర్లు రాణించాయి. పే ప్యాకేజీపై పోరాటం, ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికలు, టెక్-స్టాక్ ర్యాలీ కారణంగా మస్క్‌ సంపద బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ xAIకి 24 బిలియన్ల డాలర్లు కంటే ఎక్కువ నిధులు వచ్చి చేరడం కూడా ఆయనకు కలిసొచ్చింది. బ్లూమ్‌బర్గ్ వెల్త్‌ ఇండెక్స్‌ ప్రకారం మస్క్‌కు కంపెనీలో 65శాతం వాటా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు