Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయినట్లు సమాచారం....
వాషింగ్టన్: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయినట్లు సమాచారం. తను స్థాపించిన న్యూరాలింక్ కంపెనీలో పనిచేస్తున్న శివోన్ జిలిస్‌తో కలిసి గత ఏడాది ఆయన కవలలకు జన్మనిచ్చినట్లు బిజినెస్ ఇన్సైడర్ పత్రిక పేర్కొంది. మస్క్ ఇప్పటికే తన మాజీ భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు పిల్లలకు, కెనడా సింగర్ గ్రైమ్స్తోనూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. గత ఏడాది డిసెంబరులోనే మస్క్, గ్రైమ్స్ కలిసి సరోగసీ ద్వారా తమ రెండో బిడ్డకు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం వీరివురు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
మస్క్, జిలిస్ కలిసి ఏప్రిల్ 2022లో తమ పిల్లల పేరు మార్పుపై కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తమ పేర్లలోని చివరి పదాన్ని పిల్లల పేర్లలో ఉండేలా మార్చేందుకు అనుమతించాలని కోరినట్లు కోర్టు పత్రాల ద్వారా తెలిసిందని బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. దీనికి కోర్టు ఆమోదం లభించినట్లు కథనంలో ప్రచురించారు.
జిలిస్ (36) లింక్డిన్ ఖాతా ప్రకారం.. ప్రస్తుతం ఆమె న్యూరాలింక్‌లో ‘ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్’ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మే 2017లో ఆమె కంపెనీలో చేరారు. అదే నెల టెస్లాలో కృత్రిమ మేధ విభాగానికి డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. అక్కడ 2019 వరకు పనిచేశారు. మస్క్ స్థాపించిన మరో సంస్థ ఓపెన్ఏఐలోనూ ఆమె బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ బహుశా జిలిస్‌నే దానికి సీఈఓగా నియమించే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఈ వార్తలపై ఇటు మస్క్‌గానీ, అటు జిలిస్ ఇంకా స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్‌డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్‌కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్‌లోనే
WhatsApp payments: వాట్సప్‌లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్‌లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు