Elon Musk: మస్క్‌ను మలిచిన మూడు పుస్తకాలు.. బయోగ్రఫీలో వెల్లడించిన ప్రపంచ కుబేరుడు
ఇటీవలే ఎలాన్ మస్క్ బయోగ్రఫీ మార్కెట్లోకి వచ్చింది. అందులో ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రపంచ కుబేరుడిగా ఎదిగేందుకు తనకు స్ఫూర్తినిచ్చిన వాటి గురించి వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్.. ఈ పేరు వినగానే ఎవరికైనా టెస్లా విద్యుత్ కార్లు, స్పేస్‌ఎక్స్, ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్), న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ, సోలార్ సిటి సంస్థలు గుర్తొస్తాయి. ఇటీవలే ఆయన జీవిత కథ ‘ఎలాన్ మస్క్ (Elon Musk)’ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. వాల్టర్ ఐజాక్సన్ (Walter Isaacson) అనే అమెరికన్ రచయిత దీన్ని రచించారు. దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించిన మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగారు? జీవితంలో గొప్ప విజయాలు ఎలా సాధించారు? వంటి అంశాల గురించి ఈ పుస్తకంలో వివరించారు.
పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు మస్క్ పుస్తక పఠనం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. చిన్న వయసులో మస్క్ తండ్రి ఆఫీస్‌లో వివిధ కేటగిరీల పుస్తకాలు ఉండేవట. వాటిలో సూపర్ హీరోల కథల నుంచి ఎన్‌సైక్లోపీడియా పుస్తకాలు ఉన్నప్పటికీ, కేవలం మూడు మాత్రమే తనలో ఎంతో ఆసక్తి కలిగించాయని జీవితకథలో వెల్లడించారు. ప్రస్తుతం తాను నెలకొల్పిన సంస్థలకు వాటి నుంచే స్ఫూర్తి పొందినట్లు మస్క్ చెప్పారు. మరి, ఆ మూడు పుస్తకాలు ఏంటో చూద్దాం.
వావ్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
ది మూన్ ఈజ్ ఏ హార్ష్ మిస్ట్రెస్ (The Moon is a Harsh Mistress): 1966లో రాబర్ట్ ఏ హెన్లిన్ (Robert A Heinlein) రచించిన ఈ పుస్తకం రాకెట్ ప్రయోగాలు, కృత్రిమ మేధ (AI) గురించి తనలో ఆసక్తిని రేకెత్తించిందని తెలిపారు. దాన్ని చదివిన తర్వాతే అంతరిక్షం, గ్రహాల గురించి మస్క్ తెలుసుకోవాలనుకున్నారట. ఈ కథలో మైక్ అనే సూపర్ కంప్యూటర్ కథానాయకులకు సహాయం చేసిన విధానం.. ఏఐ మనుషులకు మేలు చేస్తుందా? ముప్పుగా మారనుందా? అనే ఆలోచనకు తనలో బీజం వేసిందని మస్క్ చెప్పినట్లు రచయిత పేర్కొన్నారు.
ది ఫౌండేషన్ సిరీస్ (The Foundation Series): 1942-50 మధ్య కాలంలో ఐజాక్ అసిమోవ్ (Isaac Asimov) రచించిన పౌండేషన్ సిరీస్.. రోబోటిక్స్, జీరో లా (Zeroth Law) గురించి వివరిస్తుంది. ఇందులో రోబోలు వాటి చర్యల ద్వారా మనుషులకు ఎలాంటి హానీ చేయవని, అవి మనుషుల ఆదేశాలను మాత్రమే పాటిస్తాయని ఉంటుంది. ఈ విషయాలే మస్క్‌కు ఏఐ, రోబోలపై ఆసక్తిని కలిగించాయని బయోగ్రఫీలో వెల్లడించారు. 2018లో మస్క్ చేసిన ట్వీట్‌లో ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు. ‘స్పేస్‌ఎక్స్ నెలకొల్పడానికి స్ఫూర్తి.. పౌండేషన్ సిరీస్‌లోని జీరో లా’ అని మస్క్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ది హిచ్‌హైకరస్ గైడ్ టు ది గెలాక్సీ (The Hitchhiker’s Guide to the Galaxy): 1979లో డగ్లస్ ఆడమ్స్ (Douglas Adams) ఈ పుస్తకాన్ని రచించారు. తొలుత ఇది బీబీసీ రేడియో కామెడీ సిరీస్‌గా ప్రసారమైంది. ఈ పుస్తకం కుంగుబాటు నుంచి బయటపడేందుకు ఎంతో సాయపడిందని మస్క్ చెప్పినట్లు బయోగ్రఫీలో ప్రస్తావించారు. ఇందులో భూమి వినాశనానికి ముందు స్పేస్‌షిప్ ఒక వ్యక్తిని కాపాడి, గెలాక్సీలోకి తీసుకెళుతుంది. తర్వాత జీవితం గురించి అతని ఆలోచనాధోరణి పూర్తిగా మారిపోతుంది. ఈ కథలోని సూపర్ కంప్యూటర్ జీవితం గురించి మనుషులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుందని, అవి జీవితం పట్ల తన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయని మస్క్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనవరి నుంచి కార్లు ప్రియం
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వెల్లడించాయి. -
6 నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 6 నెలల గరిష్ఠానికి చేరాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర సోమవారం 2013.99 డాలర్లకు చేరింది. -
రేమండ్ వ్యాపారం సాఫీగా సాగుతుంది
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరోసా ఇచ్చారు. -
రూ.13,000 కోట్లతో భారత్‌లో ఫాక్స్‌కాన్ విస్తరణ!
ఐఫోన్ తయారీ సంస్థ హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ భారత్‌లో మరింత విస్తరించనుంది. ఫాక్స్కాన్గా సుపరిచితమైన ఈ సంస్థ ఇక్కడి నిర్మాణ ప్రాజెక్టులపై 1.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్‌లో పూర్తి వాటా విక్రయించం
బ్యాంకస్యూరెన్స్ ప్రయోజనాలు పొందేందుకు, ఐడీబీఐ బ్యాంక్‌లో కొంత వాటా అట్టే పెట్టుకోవాలని.. ఆ బ్యాంక్ ప్రమోటర్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తోంది. -
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుందాం
కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. -
66,500 పాయింట్ల స్థాయి కీలకం!
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. -
అల్యూమినియంలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.61,985 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,351; రూ.62,967 వరకు రాణిస్తుందని భావించొచ్చు. -
దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం
చదువులో ఇబ్బందిపడే దివ్యాంగుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోరా’ను ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
వినియోగదారు సేవా ఏజెంట్ల పని భారం తగ్గించేందుకు ఏఐ చాట్‌బాట్‌ను వినియోగించడం ప్రారంభించినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.