Elon Musk: బాల్యంలో కష్టాలు పడ్డా.. వదంతులకు చెక్‌ పెడుతూ మస్క్‌ పోస్ట్‌

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ వేదికగా అనేక విషయాలను పంచుకుంటుంటారు. అనేక మంది ట్వీట్లకు తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల గనులపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సుదీర్ఘ ట్వీట్‌ చేశారు.

Published : 08 May 2023 22:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ అనగానే.. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు అని మాత్రమే అందరికీ తెలుసు. ఆయన చేసే ట్వీట్లు..  వ్యవహరించే తీరు.. తీసుకొనే నిర్ణయాలు చూసి.. మస్క్‌ చిన్నతనం నుంచే సంపదలో మునిగి తేలడం వల్ల ఆ తీరుగా వ్యవహరిస్తుంటాడని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ అనుకుంటున్నట్లు మస్క్‌ జీవితం కూడా అంత సాఫీగా ఏమీ సాగలేదట. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారట. తన బాల్యం కూడా ఏమంత సంతోషంగా సాగలేదంటూ తన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. దాంతో పాటూ తన తండ్రికున్న గనుల గురించి వస్తున్న వదంతులకూ చెక్‌ పెడుతూ ట్విటర్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

‘నా బాల్యం అందరూ అనుకున్నట్లుగా సాఫీగా సాగలేదు. దిగువ తరగతిలోనే పుట్టిన నేను ఎంతో కష్ట పడి ఈ స్థాయికి వచ్చా. మా నాన్న గారు ఓ చిన్న కంపెనీని పెట్టారు. అది కొద్ది కాలం బాగానే నడిచినా.. ఆ తర్వాత కష్టాల్లోకి జారింది. తర్వాత దివాళా తీసింది. దీంతో నేను, నా సోదరుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన మాకు ఆర్థికంగా సాయపడకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా బయటపడే శక్తిని మాత్రం ఇచ్చారు. డబ్బుకంటే ఎంతో విలువైన  విద్యను నేర్పించారు’ అని చెప్పారు. 

తన తండ్రికి ఎలాంటి గనులూ లేవని మస్క్‌ స్పష్టంచేశారు. ఒకవేళ ఆ గనులే ఉంటే ఆయనకు ఆర్థికంగా నేను, నా సోదరుడు ఆయనకు ఎటువంటి సహాయం చేయాల్సి వచ్చేది కాదన్నారు. మస్క్‌ చేసిన ఈ ట్వీట్‌కు ఆయన తల్లి సైతం స్పందించారు. ఆ ట్వీట్‌ని రీట్వీట్‌ చేస్తూ తానూ కొన్ని విషయాలు జోడించారు. ‘మేం 1989లో టోర్నోకి మకాం మార్చిన మెదట్లో ఒకే గదిలోనే ఉండేవాళ్లం. ఇక గనుల గురించి వదంతులను 10 సంవత్సరాల క్రితమే నేనూ విన్నాను’ అంటూ రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు