Twitter: కొన్ని ట్విటర్‌ ఖాతాలకు తగ్గనున్న ఫాలోవర్లు.. ఎందుకంటే?

Twitter: ట్విటర్‌లో కొన్ని ఖాతాలను తొలగిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. ఎలాంటి యాక్టివిటీ లేని వాటిని తీసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Updated : 09 May 2023 15:08 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత దాంట్లో అనేక మార్పులు చేస్తున్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఎలాంటి యాక్టివిటీ లేని ఖాతాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. ఖాతాల తొలగింపు వల్ల కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు కంటెంట్‌ క్రియేటర్ల వల్ల ట్విటర్‌ (Twitter)కు మంచి మద్దతు లభిస్తోందని మస్క్‌ (Elon Musk) అన్నారు. ఈ నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్‌ వల్ల క్రియేటర్లు పొందే ఆదాయం నుంచి తొలి 12 నెలల వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేశారు. తర్వాత కూడా 10 శాతం మాత్రమే ఛార్జీ ఉంటుందని తెలిపారు.

ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అనేక మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులను భారీ ఎత్తున తొలగించారు. ట్విటర్‌ బ్లూ (Twitter Blue) పేరిట సబ్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నారు. అలాగే కంటెంట్‌ క్రియేటర్లకు మానిటైజేషన్‌ ఆప్షన్‌ను ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని