బిట్‌కాయిన్లతో టెస్లా కారు కొనొచ్చు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లా ఐఎన్‌సీ చీఫ్‌ ఎలెన్‌ మస్క్‌ బుధవారం ఓ సంచలన విషయం వెల్లడించారు. ఈ ఏడాది చివరి నుంచి అమెరికా వెలుపల బిట్‌కాయిన్లతో చెల్లింపులు చేసి టెస్లాకార్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ‘‘మీరు బిట్‌కాయిన్‌తో టెస్లాను కొనుగోలు చేయవచ్చు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. అలా చేసిన చెల్లింపులను మామూలు కరెన్సీలోకి మార్చలేమని వెల్లడించారు. 

ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా 1.5బిలియన్‌ డాలర్ల బిట్‌కాయిన్లను కొనుగోలు చేస్తుందని.. కార్ల చెల్లింపులను కూడా ఈ మాధ్యంలో ఆమోదిస్తామని గత నెల ప్రకటించింది. ఆ తర్వాత ఉబెర్‌ టెక్నాలజీస్‌తో సహా పలు కంపెనీలు తమ అభిప్రాయాల్ని వెల్లడించాయి. జనరల్‌ మోటార్స్‌ కంపెనీ కూడా ఇటువంటి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.  ఇటీవల బిట్‌కాయిన్ల విలువ గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మస్క్‌ కూడా క్రిప్టోకరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరచూ ట్విటర్‌లో బిట్‌కాయిన్లకు అనుకూలంగా ట్వీట్లు చేస్తుంటారు. 

ఇవీ చదవండి..

ప్రారంభమైన బార్బెక్యూ నేషన్‌ ఐపీఓ

హ్యుందాయ్‌ 7 సీట్ల అల్కజార్‌

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని