Tesla: మరోసారి టెస్లా షేర్లను విక్రయించిన మస్క్.. కారణం చెప్పని కుబేరుడు!
Tesla: ట్విటర్ కొనుగోలుకు కావాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని మస్క్ సొంతంగా సమకూర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున షేర్లను విక్రయిస్తున్నారు. తాజాగా మరోసారి 22 మిలియన్ల షేర్లు అమ్మేశారు. అయితే, దానికి కారణం మాత్రం మస్క్ వెల్లడించలేదు.
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి భారీ ఎత్తున టెస్లా షేర్ల (Tesla Shares)ను విక్రయించారు. అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణా సంస్థ ‘యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ వివరాల ప్రకారం మస్క్ (Elon Musk) 22 మిలియన్ల షేర్లను విక్రయించారు. వీటి విలువ 3.58 బిలియన్ డాలర్లు. సోమ, మంగళ, బుధవారాల్లో ఆయన వీటిని అమ్మకానికి ఉంచారు. బుధవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి టెస్లా షేరు ధర (Tesla Share Price) 2.58 శాతం కుంగి 156 డాలర్లకు చేరింది.
తాజా విక్రయానికి కారణం ఏంటనేది మాత్రం మస్క్ (Elon Musk) వెల్లడించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ (Twitter)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి 23 బిలియన్ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్ల (Tesla Shares)ను విక్రయించారు. ఈ ఏడాది మొత్తం చూస్తే 40 బిలియన్ డాలర్లు విలువైన షేర్లను అమ్మారు. అయినప్పటికీ.. ఆ సంస్థలో ఇప్పటికీ 13.4 శాతం వాటాతో మస్కే అతిపెద్ద వాటాదారుగా ఉన్నట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ రిఫినిటివ్ వెల్లడించింది.
టెస్లా (Tesla) విద్యుత్తు కార్లతో పాటు బ్యాటరీలు, సౌర ఫలకలు తయారీ వ్యాపారంలో ఉంది. ట్విటర్‌ను కొనుగోలు చేయబోతున్నానని ఏప్రిల్‌లో మస్క్ (Elon Musk) ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాక్ విలువ సగానికి పైగా పడిపోయింది. దీంతో మస్క్ సంపద సైతం అదే స్థాయిలో కరిగిపోతూ వచ్చింది. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ సూచీలో ప్రస్తుతం ఆయన 174 బిలియన్ డాలర్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇటీవలే మస్క్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు.స్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన విధానం చాలా గందరగోళంగా సాగిన విషయం తెలిసిందే. దానికి కావాల్సిన నిధుల్లో కొంత భాగాన్ని ఆయన సొంతంగా సమకూర్చుకోవడం కూడా టెస్లా షేర్ల (Tesla Shares) విక్రయానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. పైగా ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తన సమయంలో ఎక్కువ భాగాన్ని దాని కోసమే వెచ్చిస్తున్నారన్న ఆందోళన వాటాదారుల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయన టెస్లాను పూర్తిగా విస్మరిస్తున్నారన్న భయం వారిలో బలపడుతోంది. పైగా ట్విటర్‌లో మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా టెస్లా బ్రాండ్ విలువపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలే షేరు విలువ దిగజారడానికి కారణమవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్