
Elon Musk Tesla shares: టెస్లా షేర్లను విక్రయించిన ఎలాన్ మస్క్
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) 4 బిలియన్ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్ల (Tesla Shares)ను విక్రయించారు. ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేయడానికి ఒప్పందం ఖరారు చేసుకున్న ఆయన తాను సీఈఓగా (Tesla CEO) ఉన్న టెస్లాలో 4.4 మిలియన్ షేర్లను విక్రయించారు. ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఈ మేరకు ఆయన తన షేర్లను విక్రయించినట్లు అమెరికా సెక్యూరిటీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పేర్కొన్నారు.
ట్విటర్ కొనుగోలు లావాదేవీకి కావాల్సిన 44 బిలియన్ డాలర్లలో 21 బిలియన్ డాలర్లు సొంతంగా భరించనున్నట్లు ఎలాన్ మస్క్ (Elon musk) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టెస్లా షేర్ల (Tesla Shares)ను విక్రయించక తప్పదని ముందే విశ్లేషణలు వచ్చాయి. అందుకనుగుణంగానే ఆయన తాజాగా 2.6 శాతం వాటాలను విక్రయించడం గమనార్హం. అయితే, టెస్లా షేర్ల విక్రయం ఇంతటితో ఆగుతుందని.. మరిన్ని షేర్లను వదులుకోనని మస్క్ స్పష్టం చేశారు.
ట్విటర్ (Twitter) ఒప్పందం ఖరారు కాగానే టెస్లా షేర్లు పతనమవుతూ వచ్చాయి. మస్క్ భారీ మొత్తంలో తన వాటాలను విక్రయిస్తారని ముందే వార్తలు రావడం అందుకు కారణం. మంగళవారం కంపెనీ షేర్లు ఏకంగా 12 శాతం మేర పడిపోయాయి. దీంతో ఆ ఒక్కరోజే టెస్లా మార్కెట్ విలువ 126 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ప్రస్తుతం మస్క్ (Musk)కు టెస్లాలో 17 శాతం వాటా ఉంది. షేర్ల ధర పడిపోవడంతో ఆయన వాటాల విలువ సైతం 40 బిలియన్ డాలర్లు తగ్గింది. ట్విటర్ కొనుగోలుకు ఆయన తరఫున చెల్లించాల్సిన 21 బిలియన్ డాలర్లకు ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
తాజా టెస్లా షేర్ల (Tesla Shares) విక్రయం ద్వారా మస్క్ 4.4 బిలియన్ డాలర్లు ఆర్జించారు. ట్విటర్ కొనుగోలుకు తన తరఫున చెల్లించడానికి ఇంకా 17 బిలియన్ డాలర్లు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆయన ఎలా సమీకరించనున్నారనే విషయాన్ని మత్రం వెల్లడించలేదు. అయితే, ఆయనకు ప్రముఖ రాకెట్ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)లో 43.61 శాతం వాటాలున్నాయి. దీని విలువ 100 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే, ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు.
భాగస్వామి కోసం వేట..
మస్క్ తన వాటాగా చెల్లిస్తానన్న 21 బిలియన్ డాలర్ల కోసం ఒక భాగస్వామిని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, అలాంటివారు ఆయనకు దొరుకుతారా అన్నది చూడాల్సి ఉంది. మస్క్ గత నవంబరు, డిసెంబరు నెలల్లోనూ 10 శాతం వాటాలను విక్రయించారు. మరోవైపు ఇప్పటికే ట్విటర్ డీల్ కోసం మస్క్ తన టెస్లా వాటాలను తనఖా పెట్టి 12.5 బిలియన్ డాలర్ల రుణాన్ని సమకూర్చుకున్నారు. మరికొంత మొత్తాన్ని కూడా వివిధ బ్యాంకులు సమకూర్చనున్నాయి.
ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్ డాలర్లతో మస్క్.. ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేస్తానని గతవారం ప్రకటించారు. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసిన మస్క్.. ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు. కొనుగోలు ఒప్పందం గురించి మస్క్‌తో ట్విటర్ బోర్డు కొన్నాళ్లుగా విస్తృత చర్చలు జరిపింది. తాజాగా దాదాపు 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: బాలినేని ఆవేదన ఎంతో బాధ కలిగించింది: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Sports News
IND vs IRE: సంజూకి అవకాశమా.. త్రిపాఠికి అరంగేట్రమా..?
-
World News
Sri Lanka: శ్రీలంకలో ప్రైవేటు వ్యక్తుల ఇంధన కొనుగోళ్లపై నిషేధం
-
Politics News
Maharashtra: శిందే గూటికి 14 మంది శివసేన ఎంపీలు..?
-
Movies News
Modern Love Hyderabad: సరికొత్త ప్రేమకథలు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’
-
General News
Tamilisai and KCR: రాజ్‌భవన్‌కు కేసీఆర్.. గవర్నర్, సీఎంల మధ్య చిరునవ్వులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!