Elon Musk: నష్టాల్లో ‘గిన్నిస్ రికార్డు’ సృష్టించి.. ప్రపంచ కుబేరుల జాబితాలో దిగజారి..!
ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్.. ఇటీవలే ఆ జాబితాలో తొలి స్థానాన్ని కోల్పోయారు. ఏడాది వ్యవధిలోనే సుమారు 200 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా చరిత్రలో అత్యంత సంపద నష్టపోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: అనతికాలంలో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్ (Elon Musk).. అంతే వేగంగా తన సంపద కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన వ్యక్తిగత ఆస్తులు భారీగా క్షీణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో చరిత్రలో అత్యంత సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR)’ ప్రకటించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఒక్క ఏడాది వ్యవధిలోనే (2021-2022) దాదాపు 182 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైందని అంచనా. ఇతర నివేదికలను బట్టి చూస్తే ఈ నష్టం వాస్తవానికి 200 బి.డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. చరిత్రలో ఏ సంపన్నుడూ ఈ స్థాయి నష్టాన్ని చవిచూడలేదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.
ఫోర్బ్స్ అంచనా ప్రకారం.. ప్రపంచంలోనే సంపన్న వ్యక్తిగా నిలిచిన మస్క్ సంపద 2021లో 320బి.డాలర్లుగా ఉంది. తాజాగా (2023 జనవరి) అది 138 బి.డాలర్లకు పడిపోయింది. అయితే, ఆయన సంపదలో కచ్చితంగా ఎంత మేరకు నష్టపోయారనే విషయాన్ని అంచనా వేయలేకున్నప్పటికీ.. ఏడాది వ్యవధిలోనే 182 బి.డాలర్ల నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది 58.6 బి.డాలర్ల నష్టంతో రికార్డు నెలకొల్పిన ఆయన.. తాజాగా తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. ఇలా భారీగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు (GWR) ఇటీవల వెల్లడించింది. కొంతకాలంగా సంపద ఆవిరవుతోన్న తీరుపై స్పందించిన మస్క్.. ‘దీర్ఘకాలపు సిద్ధాంతాలు బలంగా ఉంటాయి. స్వల్ప కాలిక మార్కెట్లు మాత్రం ఊహించలేం’ అని పేర్కొంటూ గతేడాది మార్కెట్లు ముగింపు రోజున (డిసెంబర్ 30) ట్వీట్ చేశారు.
ఎలాన్ మస్క్ ఆస్తులు అత్యధికంగా టెస్లా స్టాక్స్ రూపంలోనే ఉన్నాయి. ఇటీవల ఆ సంస్థ షేర్లు భారీగా పతనం అవడంతోపాటు చాలా షేర్లను మస్క్ విక్రయిస్తున్నారు. ఇలా ఒక్క 2022లోనే వాటి షేర్లు 65శాతం క్షీణించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆస్తుల విలువ తగ్గినప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా టెస్లానే కొనసాగుతుండటం విశేషం. మరోవైపు చరిత్రలోనే అత్యంత సంపద కోల్పోయిన వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించినప్పటికీ ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ సుమారు 198బి.డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో