Twitter: ‘ఇంటికెళ్లండి.. ఆఫీసుకు రావొద్దు’..: ట్విటర్ ఉద్యోగులకు మెయిల్..!
ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. కంపెనీలో భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కోతలు శుక్రవారం నుంచే మొదలుకానున్నాయి.
న్యూయార్క్: ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి కంపెనీలో ఉద్యోగుల కోతలపై అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలో సగం మంది ఉద్యోగుల్ని మస్క్ తొలగించే యోచనలో ఉన్నారని, అందుకోసం ఇప్పటికే జాబితా కూడా సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఉద్యోగుల కోతలు శుక్రవారం నుంచే మొదలుకానున్నట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
శుక్రవారం నుంచి ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపు మొదలవుతుందని సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆ కథనం పేర్కొంది. ఉద్యోగుల కోతపై శుక్రవారం ఉదయం 9 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం..) సిబ్బందిని అప్రమత్తం చేస్తామని కంపెనీ ఈ-మెయిల్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల కోతలు మొదలవుతున్న దృష్ట్యా సిబ్బంది ఇంటికి వెళ్లొచ్చని, శుక్రవారం ఆఫీసుకు రావొద్దని మెయిల్‌లో సూచించారట. ‘‘మీరు ఆఫీసులో ఉన్నా.. లేదంటే ఆఫీసుకు బయల్దేరినా.. దయచేసి తిరిగి ఇంటికి వెళ్లండి’’ అని ట్విటర్ గురువారం తమ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
‘‘ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో భాగంగా.. మేం మా సిబ్బందిని తగ్గించుకునే క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టాల్సి వచ్చింది. ఇప్పటివరకు ట్విటర్‌కు ఎంతో విలువైన సహకారాన్ని అందించిన చాలా మందిపై ఈ నిర్ణయం పెను ప్రభావం చూపిస్తుందని తెలుసు. కానీ, కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు దురదృష్టవశాత్తూ ఈ చర్య తప్పట్లేదు’’ అని ఉద్యోగులకు కంపెనీ ఈ-మెయిల్‌లో వెల్లడించినట్లు సదరు కథనం తెలిపింది.
విధుల నుంచి తీసేసిన ఉద్యోగులకు రెండు నెలల జీతంతో పాటు, వారి ఈక్విటీలకు సమానమైన నగదును మూడు నెలల్లోగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. తొలగించిన సిబ్బందికి తమ వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీల ద్వారా సమాచారం ఇవ్వనున్నారట. ఇక విధుల్లో కొనసాగే సిబ్బందికి వారి వర్క్ ఈ-మెయిల్ ఐడీల ద్వారా సమాచారాన్ని అందించనున్నట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. దాదాపు 3700 మందిని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా.. ట్విటర్ మౌలిక సదుపాయాల ఖర్చులను ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల వరకు తగ్గించుకోవాలని మస్క్..ట్విటర్ టీంను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..
-
Sports News
Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?
-
General News
Telangana News: కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత